ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే.. ఈ 7 పనులు చేయండి చాలు..!

 ఇంటి తలుపులు వీలైనంత ఎక్కువ తెరచి ఉంచాలి. గాలి వెలుతురు బాగుంటే పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది.

ఇంట్లో ఉంచుకునే వస్తువులు మనసుకు ప్రశాంతత  ఇచ్చేవిగానూ, ఆహ్లాదం కలిగించే రంగులతోనూ ఉండాలి.

విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా, హాయిగా ఉండే ఫర్నీచర్ ను ఎంపిక చేసుకోవాలి. ఇది ఇంటి వాతావరణాన్ని, వ్యక్తుల మానసిక స్థితిని సానుకూలంగా ఉంచుతుంది.

పాజిటివ్ ఎనర్జీని పెంచే పువ్వులు, మొక్కలను ఇంట్లో  ఉంచాలి. ఇవి ఇల్లంతా ప్రశాంతతను, పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తాయి.

ఇంట్లో ఆయిల్ డిప్యూజర్ వాడటం వల్ల ఇల్లంతా పాజిటివ్ శక్తి నిండుకుంటుంది. సువాసన గల నూనెలను నీటిలో వేసి దీపాలు వెలిగించడం వల్ల ఇల్లంతా సువాసన అలముకుంటుంది.

ఇంటి గోడల మీద ఉంచే ఫోటోలు అర్థవంతమైనవిగా, పాజిటివ్ ఎనర్జీని పెంచేవిగా ఉండాలి.  ఇవి సానుకూల శక్తిని పెంచడంలో గొప్పగా సహాయపడతాయి.

 ఇంటి పరిసరాలను, ఇంట్లో వస్తువులను శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది.