జాగ్రత్త.. టీతో పాటు వీటిని తీసుకోకండి.. 

టీ తాగడానికి ముందు లేదా తర్వాత నిమ్మరసం తాగకండి. టీ, నిమ్మరసం కలిసి మీ కడుపులో యాసిడ్‌గా మారతాయి. పలు జీర్ణ సంబంధ సమస్యలను తీసుకొస్తాయి.

శెనగ పిండితో చేసిన పదార్థాలను టీతో పాటు తీసుకోకూడదు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల పోషకాలను శోషించుకునే శక్తి జీర్ణ వ్యవస్థ కోల్పోతుంది.

టీ తాగే సమయంలో పసుపు కలిపిన ఆహార పదార్థాలను తీసుకోకండి. ఈ రెండు కలిస్తే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలకు కారణమవుతాయి.

టీ తాగే ముందు చాలా మంది మంచినీళ్లు తాగుతారు. అయితే కూలింగ్ వాటర్ మాత్రం తాగకూడదు. వివిధ ఉష్ణోగ్రతలు ఉన్న ద్రవాలను ఒకేసారి తీసుకుంటే జీర్ణ సమస్యలు మొదలవుతాయి.

టీ తాగే ముందు లేదా తర్వాత మజ్జిగ, పెరుగు తీసుకోకండి. ఆమ్ల స్వభావం కలిగిన టీ, మజ్జిగ మీ జీర్ణవ్యవస్థకు నష్టం చేకూరుస్తాయి.

టీ తాగే సమయంలో నట్స్ కూడా తీసుకోవద్దు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం పాలతో కలవదు. ఫలితంగా అజీర్ణ సమస్యలు వెంటాడతాయి.

టీ తోపాటు బాగా స్వీట్‌గా ఉండే కుకీలు, చాక్లెట్లు, బిస్కెట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు ఒకేసారి పెరిగిపోతాయి. ఫలితంగా పలు సమస్యలు మొదలవుతాయి.

టీతో పాటు నూనెలో వేయించిన సమోసాలు, పకోడీలు ఎక్కువగా తినడం అనర్థం. కడుపు అంతా బరువుగా మారి అసౌకర్యానికి దారి తీస్తుంది.

టీతో పాటు పళ్లు తీసుకుంటే ఎసిడిటీని ఆహ్వానించినట్టే. రెండూ యాసిడ్ రిఫ్లక్స్‌కు దారి తీస్తాయి.