అనంత్ అంబానీ.. 108 కిలోల బరువు ఎలా తగ్గాడంటే..

అనంత్ అంబానీ వెయిట్ లాస్ జర్నీ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అనంత్ గతంలో 208 కిలోల బరువు ఉండేవాడు. అతిగా జంక్ ఫుడ్ తినడం అనంత్‌కు అలవాటు.

కేవలం 18 నెలల్లో సహజ పద్ధతుల ద్వారానే అనంత్ 108 కిలోల బరువు తగ్గి అందరికీ షాకిచ్చాడు.

బాలీవుడ్ సెలబ్రిటీ ట్రైనర్ వినోద్ చన్నా నేతృత్వంలో వర్కవుట్స్ చేసి అనంత్ తన బరువును 100 కిలోలకు తగ్గించుకున్నాడు.

వినోద్ చన్నా 12 సెషన్ల పాటు ట్రైనింగ్ ఇస్తే 1.2 లక్షలు ఫీజ్‌గా తీసుకుంటాడు. జాన్ అబ్రహం, నీతా అంబానీ, వివేక్ ఒబేరాయ్ వంటి ఎంతో మంది ప్రముఖులకు వినోద్ వ్యక్తిగత శిక్షకుడు

అనంత్ రోజుకు 21 కిలోమీటర్లు నడిచేవాడు. రోజుకు 5 నుంచి 6 గంటల పాటు వర్కవుట్స్ చేసేవాడు. యోగా, కార్డియో వ్యాయామాలు చేసేవాడు.

అనంత్ కోసం ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే డైట్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. అర టీ స్పూన్ నెయ్యి, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, ఛీజ్ తీసుకునేవాడు.

వర్కవుట్స్ సమయంలో రోజుకు అనంత్ 1200 నుంచి 14000 కేలరీల వరకు బర్న్ చేసేవాడు. చాలా తక్కువ మొత్తంలో రోజుకు ఆరుసార్లు భోజనం చేసేవాడు.

స్ట్రెస్ లేకుండా ఉండడం కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందుకోసం అనంత్ యోగా, ధ్యానం చేసేవాడు. రాత్రి వేళల్లో తగినంత సమయం నిద్రపోయేవాడు.

అనంత్ చాలా ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆస్తమా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారు. దాంతో అనంత్ మళ్లీ బరువు పెరిగినట్టు తెలుస్తోంది.