Share News

Sugar: పంచదార నిజంగానే ఆరోగ్యానికి చేటు చేస్తుందా? రోజూ ఎంత పంచదార తినొచ్చంటే..!

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:20 PM

ఈమధ్య కాలంలో పంచదారకు సంబంధించి చాలా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కొందరు ఆరోగ్యం మీద స్పృహతో పంచదార వాడకమే మానేస్తున్నారు. అసలు పంచదార నిజంగానే ఆరోగ్యానికి చేటు చేస్తుందా? ఇది బరువు పెరగడానికి కారణం అవుతుందా? ఆరోగ్యం సేఫ్ గా ఉండాలంటే రోజులో ఎంత పంచదార తీసుకోవచ్చు?

Sugar: పంచదార నిజంగానే ఆరోగ్యానికి చేటు చేస్తుందా? రోజూ ఎంత పంచదార తినొచ్చంటే..!

పంచదార ప్రతి ఇంట్లో వాడే పదార్థం. నిజానికి దీన్ని కాఫీ, టీ, జ్యూస్, స్వీట్లలో ఎక్కువగా వాడుతుంటాం. ఈమధ్య కాలంలో పంచదారకు సంబంధించి చాలా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పంచదార అధిక వినియోగం వల్ల మధుమేహం వస్తుందని అంటున్నారు. కొందరు ఆరోగ్యం మీద స్పృహతో పంచదార వాడకమే మానేస్తున్నారు. అసలు పంచదార నిజంగానే ఆరోగ్యానికి చేటు చేస్తుందా? ఇది బరువు పెరగడానికి కారణం అవుతుందా? ఆరోగ్యం సేఫ్ గా ఉండాలంటే రోజులో ఎంత పంచదార తీసుకోవచ్చు? తెలుసుకుంటే..

పంచదార నేరుగా కొవ్వు పేరుకుపోవడానికి కారణం కానప్పటికీ ఇది పరోక్షంగా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. పంచదార ఎక్కువ వినియోగిస్తే శరీరంలోకి వెళ్లే కేలరీల శాతం కూడా పెరుగుతుంది . ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. ఇది ఆహారాన్ని రుచికరంగా మారుస్తుంది. ఈ కారణంగా ఎక్కువ తింటారు. బరువు పెరగడానికి కారణమవుతుంది.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!


రోజులో ఎంత చక్కెర తీసుకోవచ్చు..

చక్కెర నేరుగా బరువు పెరగడానికి కారణం కాకపోయినా దీన్ని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య నివేదికల ప్రకారం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో చక్కెర నుండి శరీరానికి అందే కేలరీలు 5శాతానికి మించకూడదు. ఇక ప్రతిరోజూ 30గ్రాముల కంటే ఎక్కువ చక్కెర వాడకూడదు. పంచదార వాడేటప్పుడు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లల వయస్సు ఆధారంగా రోజులో 19గ్రాముల నుండి 24గ్రాముల లోపు మాత్రమే చక్కెర తీసుకునేలా చూడాలి. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే బరువు పెరగడం, మధుమేహం, గుండె జబ్బులతో సహా వివిధ ఆరోగ్య సమస్యలు పెరగడానికి కూడా కారణమవుతుంది.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!

బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 12:20 PM