పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడాలంటే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పకూడని 8 విషయాలున్నాయి.

పిల్లల ముందు కానీ పిల్లలను ఉద్దేశించి కానీ కఠినమైన మాటలు ఉపయోగించకూడదు. ఇది పిల్లలలో మానసిక క్షోభకు కారణమవుతుంది.

పిల్లలు మంచి పనులు చేస్తే వాళ్లకు బహుమతులు ఇస్తాం అని చెప్పకూడదు. ఇది వారిని ప్రోత్సహించే మార్గమే అయినా వారి ప్రవర్తన భౌతిక విషయాల మీద, వస్తువుల మీద ఆధారపడేలా చేస్తుంది.

పిల్లలను ఇతరులతో పోల్చకూడదు.  దీనివల్ల పిల్లలలో సెల్ప్ రెస్పెక్ట్ పోతుంది.  వాళ్లలో ఉండే ప్రతిభ కూడా మరుగున పడిపోతుంది.

పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో అతిగా పొగడటం కూడా మంచిది కాదు. ఇది అతివిశ్వాసం, అహంకారానికి దారితీస్తుంది. ఎప్పుడైనా ఓటమిని అంగీకరించలేరు.

పిల్లలకు భయం పెట్టడానికి పరిధికి మించి వారిని హెచ్చరించకూడదు.

పిల్లలు అల్లరి చేసినా, తప్పు చేసినా వారి వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ విమర్శించకూడదు.

పిల్లల ఎమోషన్స్ ను  నియంత్రించకూడదు. ఇది వారిలో ఎమోషన్ డవలప్మెంట్ ను దెబ్బతీస్తుంది.

పిల్లలకు అబద్దాలు చెప్పడం, నెరవేరని వాగ్ధానాలు చేయడం వల్ల పిల్లలలో తల్లిదండ్రుల మీద అపనమ్మకానికి దారి తీస్తుంది.