Share News

Sugar: కొబ్బెర vs బెల్లం vs బ్రౌన్ షుగర్ vs సాధారణ చక్కెర.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:10 PM

ఏ షుగర్ వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. వీటి మధ్య తేడాలేంటంటే..

Sugar: కొబ్బెర vs బెల్లం vs  బ్రౌన్ షుగర్ vs  సాధారణ చక్కెర..  ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!

చక్కెర రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉపయోగించే పదార్థం. కానీ ఆరోగ్య స్పృహ ఉన్నవారు, అనారోగ్య సమస్యలున్నవారు చక్కెర వాడకం విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కొందరు బెల్లం, మరికొందరు బ్రౌన్ షుగర్ వాడుతుంటారు. చాలా అరుదుగా పామ్ షుగర్ లేదా కొబ్బరి షుగర్ వాడతారు. అధికశాతం మంది సాధారణ పంచదార వాడతారు. ఇంతకీ ఏ షుగర్ వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. వీటి మధ్య తేడాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

పామ్ షుగర్ లేదా కొబ్బరి షుగర్..

పామ్ షుగర్ ను కొబ్బరి, తాటి చెట్ల రసం నుండి తయారుచేస్తారు. ఇది రుచికరమైన వంటకాల్లో ఉపయోగించబడుతుంది.

బ్రౌన్ షుగర్..

బ్రౌన్ షుగర్ శుద్ధి చేసిన తెల్ల చక్కెరకు మొలాసిస్‌ను కొద్దిగా జోడించడం ద్వారా తయారు చేయబడుతుంది.

బెల్లం..

చెరకు రసం లేదా తాటి రసం నుండి నీటిని ఆవిరి చేయడం ద్వారా బెల్లం తయారు చేస్తారు, తరువాత దానిని ఘనీభవించి వినియోగిస్తారు.

ఇది కూడా చదవండి: విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయల గురించి తెలుసా?

సాధారణ చక్కెర..

శుద్ధి చేసిన చక్కెర చెరకు రసంతో తయారు చేయబడుతుంది, అయితే తెల్ల చక్కెరను తయారుచేయడంలో అనేక శుద్ధి ప్రక్రియలకు లోనవుతుంది.


పోషకాల కంటెంట్..

పామ్ షుగర్.. ఇనుము, జింక్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లతో సహా కొన్ని పోషకాలను కలిగి ఉంటుంది. శుద్ధి చేసిన చక్కెరల కంటే ఇందులో పోషకాలు మెరుగ్గా ఉంటాయి.

బ్రౌన్ షుగర్.. రెగ్యులర్‌తో షుగర్ తో పోలిస్తే, బ్రౌన్ షుగర్‌లో మొలాసిస్ ఉండటం వల్ల కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.

బెల్లం... బెల్లం రకం, ప్రాసెసింగ్ ఆధారంగా ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, బెల్లంలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైంది.

సాధారణ షుగర్..సాధారణ షుగర్ లో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. ఇది అధిక మొత్తంలో సుక్రోజ్‌ని కలిగి ఉంటుంది. ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉండవు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 05:10 PM