Sprouts: మొలకలు ఎందుకు తినాలో చెప్పే 5 బలమైన కారణాలు ఇవీ..!
ABN , Publish Date - Feb 18 , 2024 | 04:12 PM
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో చాలామంది మొలకలు తింటూ ఉంటారు. అయితే మొలకలు తినడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇవీ..
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో చాలామంది మొలకలు తింటూ ఉంటారు. మొలకలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని, అవి శరీరానికి బలాన్ని బాగా ఇస్తాయని అంటారు. అయితే మొలకలు తినడం వల్ల కేవలం ప్రోటీన్ అందడమే కాదు.. శరీరానికి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
బ్లడ్ షుగర్ ..
మొలకెత్తిన ధాన్యాలు తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇవి ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. మొలకలలో సల్ఫోరాఫేన్ ఉంటుంది, ఇది టైప్ డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి: మనచుట్టూ ఉండే అత్యంత విషపూరితమైన మొక్కలివీ..!
క్యాన్సర్ ప్రమాదం..
మొలకెత్తిన ధాన్యాలు తీసుకుంటే క్యాన్సర్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులకు మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే సల్ఫోరాఫేన్ క్యాన్సర్ కణాలను నిరోధించడానికి పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యం..
మొలకలు యాంటీ హైపర్లిపిడెమిక్‌గా పనిచేస్తాయి. ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది. మొలకెత్తిన గింజలను తీసుకుంటే, చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తహీనత..
మొలకెత్తిన ధాన్యాలలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ఈ కారణంగా వీటిని బాగా తీసుకుంటే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఐరన్ తో పాటు, తృణధాన్యాలలో అధిక మొత్తంలో విటమిన్లు కూడా ఉంటాయి.
కంటి ఆరోగ్యం..
మొలకెత్తిన ధాన్యాలు తీసుకోవడం కంటికి కూడా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ సి రెండూ ఉంటాయి, ఇది ప్రత్యేకంగా కళ్లకు మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఈ మెషీన్ భలే ఉందే.. దీంతో ఆడవాళ్లకు ఎంత శ్రమ తగ్గుతుందంటే..!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.