Share News

Sada bahar plant: పూజకే కాదండోయ్.. బిళ్ల గన్నేరు మొక్కను ఇలా వాడితే షాకింగ్ ఫలితాలుంటాయ్..!

ABN , Publish Date - May 29 , 2024 | 04:26 PM

ప్రకృతి చాలా విచిత్రమైనది. సరిగ్గా తెలుసుకుని అనుసరించాలే కానీ మనిషిలో బోలెడు అనారోగ్యాలకు ప్రకృతే వైద్యం చేస్తుంది. మన చుట్టూ ఉన్న ఎన్నో రకాల మొక్కలు, పువ్వులు, కాయలు గొప్ప ఔషధాలుగా పనిచేస్తాయి. చాలావరకు ఇళ్లలో అలంకరణ కోసం పెంచే మొక్కలలో బిళ్ళ గన్నేరు మొక్క తప్పకుండా ఉంటుంది.

Sada bahar plant:  పూజకే కాదండోయ్.. బిళ్ల గన్నేరు మొక్కను ఇలా వాడితే షాకింగ్ ఫలితాలుంటాయ్..!

ప్రకృతి చాలా విచిత్రమైనది. సరిగ్గా తెలుసుకుని అనుసరించాలే కానీ మనిషిలో బోలెడు అనారోగ్యాలకు ప్రకృతే వైద్యం చేస్తుంది. మన చుట్టూ ఉన్న ఎన్నో రకాల మొక్కలు, పువ్వులు, కాయలు గొప్ప ఔషధాలుగా పనిచేస్తాయి. చాలావరకు ఇళ్లలో అలంకరణ కోసం పెంచే మొక్కలలో బిళ్ళ గన్నేరు మొక్క తప్పకుండా ఉంటుంది. ఈ సతత హరిత మొక్క చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఈ బిళ్ల గన్నేరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

బిళ్ల గన్నేరు మొక్క మధుమేహానికి మ్యాజిక్ వైద్యం చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా బాధిస్తున్న మధుమేహానికి చెక్ పెడుతుంది. దీనికోసం బిళ్ల గన్నేరు మొక్క సారాన్ని ఉపయోగించవచ్చట. ఈ మొక్కలో శక్తివంతమైన యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలలో తేలింది.

పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!


రక్త స్రావం సమస్యలు, జబ్బులు తగ్గించడంలో బిళ్ల గన్నేరు మొక్క చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఫైల్స్ రోగులకు ఇది దివ్యౌషధం కంటే తక్కువ కాదు.

క్యాన్సర్ చికిత్సలో బిళ్ల గన్నేరు మొక్కను ఉపయోగిస్తారంటే చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. కానీ చాలా ఫార్మసీ సంస్థలు క్యాన్సర్ మందుల తయారీలో బిళ్ల గన్నేరు మొక్కను వినియోగిస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడతాయి.

బిళ్ల గన్నేరు మొక్కతో ఊపిరితిత్తుల సమస్యలు నయం చేయవచ్చు. దగ్గు, ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సమస్యలు మొదలైనవాటి నుండి ఉపశమనం కలిగించే గుణాలు బిళ్ల గన్నేరు మొక్క సారంలో ఉంటాయి.

మధుమేహం ఉన్నవారి లిపిడ్ ప్రోఫైల్ ను మెరుగుపరచడంలో బిళ్ల గన్నేరు మొక్క సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంలో కూడా ప్రభావమంతగా ఉంటుంది.

బిళ్ల గన్నేరు మొక్క ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూర్చినా వైద్యుల పర్యవేక్షణలోనే దీన్ని ఉపయోగించాలి. ఇందులో ఔషద గుణాలతో పాటు టాక్సిన్లు కూడా ఉంటాయి. ఇవి దుష్ప్రభావాలు కలిగిస్తాయి.

కాలేయం డ్యామేజ్ అయితే కనిపించే లక్షణాలు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 29 , 2024 | 04:26 PM