కాలేయం డ్యామేజ్ అయితే కనిపించే లక్షణాలు ఇవీ..!

పోషకాల జీవక్రియకు, టాక్సిన్స్ తొలగించడానికి కాలేయం సిరగా పనిచేయాలి. ఇది పనిచేయకపోతే దీర్ఘకాలిక అలసట,  బలహీనత ఏర్పడుతాయి.

కాలేయం సమస్యలున్నవారిలో కాళ్లు, పొత్తికడుపులో నీరు నిలుస్తుంది. ఈ కారణంగా వాపు కనిపిస్తుంది. ఈ పరిస్థితిని అస్పైట్స్ అని అంటారు.  

పొత్తికడుపు కుడిభాగానికి పైన పక్కటెముకల కింద కాలేయ నొప్పి లేదా అసౌకర్యం కలుగుతుంది. ఇది ఒక్కోసారి నొప్పి ఎక్కువ కలిగి ఉంటుంది.

కాలేయ క్యాన్సర్, సిర్రోసిస్ లేదా హెపటైటిస్ వంటి పరిస్థితుల వల్ల అనుకోకుండా బరువు తగ్గుతారు.

మలం, మూత్రం రంగులో మార్పులు కాలేయ సమస్యలను సూచిస్తాయి.  పిత్త వర్ణద్రవ్యం లేకపోవడం వల్ల మలం రంగు బంకమట్టి రంగులో ఉంటుంది.  అయితే బిలిరుబిన్ అధికంగా ఉంటే మూత్రం ముదురు రంగులో ఉంటుంది.

ఎర్ర రక్తకణాలు విచ్చిన్నమైనప్పుడు బిలిరుబిన్ అని పిలువబడే పసుపు వర్ణద్రవ్యం కాలేయంలో విచ్తిన్నం కాదు.  ఇది హెపటైటిస్, సిర్రోసిస్,పిత్త వాహికకు అడ్డుపడటం వంటి అనేక కాలేయ సమస్యలను సూచిస్తుంది.

కాలేయం సరిగా పనిచేయనప్పుడు పిత్త లవణాలు రక్తప్రవాహంలో పేరుకుపోతాయి. ఇది ప్రురిటస్ లేదా దురదకు దారితీస్తుంది.