Share News

Sabja Water: సబ్జా నీటిని ఇలా తాగి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!

ABN , Publish Date - May 21 , 2024 | 04:18 PM

సబ్జా గింజలలో కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఇతర సూక్ష్మపోషకాలు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. వీటిని రిఫ్రెష్ డ్రింక్స్ లోనే కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో సబ్జా నీరు తాగితే షాకింగ్ ప్రయోజనాలుంటాయి.

Sabja Water: సబ్జా నీటిని ఇలా తాగి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!

ఇప్పట్లో చాలా రకాల పానీయాలలో సబ్జా గింజలు వాడుతున్నారు. చూడటానికి జెల్లీ లాగా నోట్లో వేసుకుంటే ఇట్టే గొంతులోకి జారిపోతూ చాలా ఫన్ కూడా ఇస్తాయి సబ్జా గింజలు. సబ్జా గింజలలో కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఇతర సూక్ష్మపోషకాలు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. వీటిని రిఫ్రెష్ డ్రింక్స్ లోనే కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో సబ్జా నీరు తాగితే షాకింగ్ ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకుంటే..

సబ్జా గింజలు పోషకాల పవర్‌హౌస్. వీటిలో ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ సహా వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో సబ్జా నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఈ పోషకాలు సమర్థవంతంగా అందుతాయి. ఉదయాన్నే ఈ పోషకాహార డ్రింక్ తో తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!


సబ్జా నీరు జీర్ణ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. సబ్జా గింజలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ నుండి ఉపశమనం కలిగించే కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే సబ్జా నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.

సబ్జా గింజలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా వీటిని తీసుకున్నప్పుడు కడుపులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. కేలరీలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

మధుమేహం ఉన్నవారు అయినా లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకూడదని జాగ్రత్త పడేవారు అయినా సబ్జా నీరు తాగితే మంచిది. ఇది కార్భోహైడ్రేట్ల శోషణను నెమ్మదించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది.

సబ్జా గింజలలో డిటాక్సిఫైయింగ్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్లను మూత్రం గుండా వెళ్లిపోయేలా చేస్తాయి. ఖాళీ కడుపుతో సబ్జా నీరు తాగితే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

సబ్జా గింజలలో యాంటీఆక్సిడెంట్లు మెరుగ్గా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

సబ్జా గింజలలో ఉండే విటమిన్లు, మినరల్స్, యంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!

బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 21 , 2024 | 04:18 PM