బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!

చిక్కుళ్లు..   బీన్స్, కాయధాన్యాలు, శనగలలో ఫైబర్ మెండుగా ఉంటుంది.  ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.

తృణధాన్యాలు.. క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి బరువు తగ్గడంలో సహాయపడతాయి.  ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తాయి. శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి. 

బెర్రీలు.. రాస్బెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీలలో ఫైబర్ బాగుంటుంది.  యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీలతో బరువు తగ్గాడనికి సహాయపడతాయి.

గింజలు, విత్తనాలు.. బాదం, చియా, అవిసె వంటి గింజలు ఆకలిని అరికట్టడంలో సహాయపడతాయి. ఇవి ఆరోగ్యవంతమైన కొవ్వులను అందిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

అవకాడో.. ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటూ ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది.  ఇది ఆకలిని నియంత్రిస్తుంది.  బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

స్వీట్ పొటాటో.. ఫైబర్ ఎక్కువ ఉండి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే చిలకడదుంపలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

చియా.. చియా సీడ్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇవి కడుపు నిండిన ఫీల్ ఎక్కువసేపు ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి.

బ్రస్సెల్స్ మొలకలు.. ఇవి క్రూసిఫెరస్ కూరగాయలు. ఫైబర్ తో పాటు పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆప్షన్.