Share News

Period Cramps: నెలసరిలో కడుపునొప్పి, తిమ్మిర్ల సమస్య వేధిస్తోందా? ఈ 5 చిట్కాలు పాటించి చూడండి..!

ABN , Publish Date - May 02 , 2024 | 03:06 PM

కొందరిలో నెలసరి సమయంలో కడుపునొప్పి, పొత్తి కడుపు కండరాల తిమ్మిర్లు వస్తాయి. ఇవి చాలా బాధాకరంగా ఉంటాయి. నెలసరి రోజుల్లో ఉండే నీరసం వీటి కారణంగా మరింత ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఇవి తగ్గడానికి ఇంటిపట్టునే ఇలా చేస్తే సరి.

Period Cramps: నెలసరిలో  కడుపునొప్పి, తిమ్మిర్ల సమస్య వేధిస్తోందా? ఈ 5 చిట్కాలు పాటించి చూడండి..!

నెలసరి.. ఓ వయసు వచ్చాక ప్రతి ఆడపిల్లకు సహజమైన విషయం. అయితే ఇది మాటల్లో చెప్పినంత సహజంగా ఏమీ ఉండదు. కొందరిలో నెలసరి సమయంలో కడుపునొప్పి, పొత్తి కడుపు కండరాల తిమ్మిర్లు వస్తాయి. ఇవి చాలా బాధాకరంగా ఉంటాయి. నెలసరి రోజుల్లో ఉండే నీరసం వీటి కారణంగా మరింత ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఈ నొప్పి, బాధ కారణంగా చాలా మంది అమ్మాయిలు నెలసరి రోజుల్లో ఆహారం సరిగా తీసుకోరు కూడా. అయితే ఇంటి చిట్కాలు ఈ నొప్పుల నివారణకు చక్కగా పనిచేస్తాయి. నెలసరి సమస్యలను తగ్గించే 5 ఇంటి చిట్కాలేంటో తెలుసుకుంటే..

హీట్ ప్యాక్..

నెలసరి కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లకు హీట్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. కడుపు కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి, తిమ్మిర్లను తగ్గించడానికి ఈ హీట్ ప్యాక్ బాగా సహాయపడుతుంది. హీటింగ్ ప్యాడ్, వేడినీటి బాటిల్, వెచ్చని టవల్.. ఇలా ఏదైనా హీట్ ప్యాక్ కోసం వాడొచ్చు.

విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!


హెర్బల్ టీలు..

చమోమిలే టీ, అల్లం టీ.. వంటి కొన్ని హెర్బల్ టీలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి నెలసరిలో ఎదురయ్యే నొప్పి, తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. గోరువెచ్చగా ఉండే హెర్బల్ టీ తీసుకోవడం మంచిది.

మసాజ్..

పొత్తి కడుపును, దిగువ వీపు భాగాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల కండరాల ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. కండరాల తిమ్మిరి తగ్గించుకోవడానికి వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయాలి.

అత్యధిక ఐక్యూ లెవెల్స్ ఉన్న దేశాలు ఇవే..!


స్నానం..

శరీరంలో కండరాలు రిలాక్స్ కావడం కోసం వెచ్చని నీటితో స్నానం చెయ్యాలి. ఇది నెలసరి సమయంలో ఉండే ఆందోళన, చికాకు, నెలసరి కడుపునొప్పి, తిమ్మిర్లు వంటివి తగ్గిస్తుంది. ఇంకా స్నానం చేసే నీటిలో ఎప్సమ్ లవణం లేదా ఎసెంటియల్ ఆయిల్స్ కొన్ని చుక్కలు జోడించుకున్నా చాలా ఉపశమనంగా ఉంటుంది.

మెగ్నీషియం..

మెగ్నీషియం శరీరంలో కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి, నెలసరి తిమ్మిరి తగ్గించడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం కోసం గుమ్మడి విత్తనాలు, ఆకుకూరలు, పాలకూర, బాదం, జీడిపప్పు వంటి మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

అత్యధిక ఐక్యూ లెవెల్స్ ఉన్న దేశాలు ఇవే..!

విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 02 , 2024 | 03:06 PM