Share News

Papaya: బొప్పాయి తినడానికి సరైన సమయం ఏది? ఏ సమయంలో తింటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయంటే..!

ABN , Publish Date - Apr 11 , 2024 | 03:49 PM

బొప్పాయితో పూర్తీ ప్రయోజనాలు శరీరానికి లభించాలంటే ఏ సమయంలో దీన్ని తింటే బెస్టంటే..

Papaya: బొప్పాయి తినడానికి సరైన సమయం ఏది? ఏ సమయంలో తింటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయంటే..!

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి పండులోనూ ప్రత్యేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అటు మధుమేహం ఉన్నవారికి ఇటు సాధారణ వ్యక్తులు తినదగిన పండ్లలో బొప్పాయి ముఖ్యమైనది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తింటే శరీరంలో వాపులు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీంట్లో ఉండే జీర్ణక్రియ లక్షణాల కారణంగా హైపర్ ఎసిడిటీ నుండి ఉపశమనం పొందవచ్చు. ఇక ఇందులో కేలరీలు కూడా తక్కువ. ఈ పండుతో కలిగే పూర్తీ ప్రయోజనాలు శరీరానికి లభించాలంటే ఏ సమయంలో ఈ పండును తినాలి? ఏ సమయంలో తింటే బెనిఫిట్స్ బాగుంటాయంటే..

ఖాళీ కడుపుతో బొప్పాయి..

బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని రోజంతా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బొప్పాయిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల మొటిమలను తగ్గించడంలో, చిన్న వయసులోనే వృద్దాప్యం ఎదురవ్వడం వంటివి నివారించడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: వేసవిలో పొరపాటున కూడా తినకూడని 8 మసాలాలు ఇవీ..!


బొప్పాయి ఎవరు తినకూడదంటే..

బొప్పాయి ఆరోగ్యకరమైన పండు అయినప్పటికీ ఇది ఖచ్చితంగా అందరికీ ఆరోగ్యం కాదు. గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇందులో లేటెక్స్ గర్భాశయ సంకోచాలను కలిగిస్తుంది, ఇది త్వరగా ప్రసవానికి దారితీస్తుంది.

బొప్పాయి తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు, అయితే ఇప్పటికే హృదయ స్పందనలు బ్యాలెన్స్ గా లేకపోతే ఈ పండు తినడం మానుకోండి.

మానవ జీర్ణవ్యవస్థలో హైడ్రోజన్ సైనైడ్‌ను ఉత్పత్తి చేయగల అమినో యాసిడ్ అయిన సైనోజెనిక్ గ్లైకోసైడ్ బొప్పాయిలో ఉంటుంది. ఇది సమస్యలను కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ బ్లడ్ షుగర్ లేదా హైపోగ్లైసీమియాతో బాధపడేవారు బొప్పాయి తినడం మానుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 03:49 PM