వేసవిలో పొరపాటున కూడా తినకూడని 8 మసాలాలు ఇవీ..!

లవంగాలు.. లవంగాలలో యూజినాల్ ఉంటుంది. ఇది శరీరాన్ని వేడెక్కేలా చేస్తుంది.  అధిక వేడి ఉన్న ప్రాంతాలలో నివసించేవారు దీన్ని తినకపోవడం మంచిది.

మిరియాలు.. మిరియాలు వేడి చేసే గుణం కలిగి ఉంటాయి. వీటిని వేసవికాలంలో వీలైనంత తక్కువ తినడం మంచిది.

అల్లం.. వేసవి పానీయాలకు అల్లాన్ని జోడించడం చాలామందికి అలవాటు. కానీ అల్లం వేడి చేస్తుంది. వేసవిలో దీన్ని తక్కువ వాడాలి.

వెల్లుల్లి.. అల్లం మాదిరిగానే వెల్లుల్లిలో కూడా వేడెక్కించే గుణాలు ఉంటాయి.  వెల్లుల్లిని వేసవిలో తక్కువ వాడాలి.

ఎర్ర మిరపకాయలు.. ఎర్ర మిరపకాయలు వేడి చేస్తాయి. చెమట పట్టేలా చేస్తాయి. వేసవిలో వీటిని తినకపోవడం మంచిది.

దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క రుచిగా ఉన్నా ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది. దీన్ని వేసవిలో తక్కువగా వాడాలి. 1

ఆవాలు.. ఆవాలు విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. వేసవి కాలంలో వీటిని ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

గుర్రపు ముల్లంగి.. గుర్రపు ముల్లంగి విపరీతమైన వేడి స్వభావం కలిగి ఉంటుంది.  వేసవిలో దీన్ని తక్కువ వాడాలి.