Share News

Mangoes: మామిడి పండ్లు తింటే మీకూ ఇలాగే జరుగుతుందా?

ABN , Publish Date - May 22 , 2024 | 05:20 PM

వేసవికాలంలో మామిడిపండ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా మామిడి పండ్లు తింటారు. మామిడిపండ్లను తినడంలో బోర్ కొట్టకుండా వాటిని నేరుగా తినడానికి బదులు పానీయాలు, మిల్క్ షేక్ లు, సలాడ్లు, కుల్పీలు.. ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తారు. అయితే

Mangoes: మామిడి పండ్లు తింటే మీకూ ఇలాగే జరుగుతుందా?

వేసవికాలంలో మామిడిపండ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా మామిడి పండ్లు తింటారు. మామిడిపండ్లను తినడంలో బోర్ కొట్టకుండా వాటిని నేరుగా తినడానికి బదులు పానీయాలు, మిల్క్ షేక్ లు, సలాడ్లు, కుల్పీలు.. ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తారు. అయితే మామిడి పండ్లు తిన్న తరువాత కొంతమందికి ముఖం మీద మొటిమలు వస్తాయి. కొందరికి ఈ సమస్య చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఈ కారణంగా మామిడి పండ్లు తినాలంటే భయపడేవారు కూడా ఉంటారు. అసలు మామిడి పండ్లు తినగానే ముఖం మీద మొటిమలు ఎందుకు వస్తాయి? తెలుసుకుంటే..

బాదం బంక ఎప్పుడైనా తిన్నారా? వేసవిలో దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!


మామిడిపండు ఎక్కువగా తినడం వల్ల ముఖంపై మొటిమలు, పొట్టలో అసిడిటీ, గుండెల్లో మంట వంటివి కూడా వస్తాయి. మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యకరమైన పండ్లలో పరిగణించబడుతుంది. కానీ మామిడిలో మొటిమలను కలిగించే ఫైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఫైటిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ వేడి కారణంగా, ముఖంపై మొటిమలు వస్తాయి. చర్మం మీద పగుళ్లు వచ్చే సమస్య కూడా ఉంటుంది. అలాగే మామిడి పండ్లలో తీపి శాతం ఎక్కువ ఉంటుంది. ఇలా తీపి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ముఖం మీద మొటిమలు వస్తాయి. మామిడి పండ్లు నేరుగా మొటిమలకు కారణం కాకపోయినా మొటిమలు వచ్చే పరిస్థితులను ప్రేరేపిస్తుంది.

జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!


మామిడి పండ్లు తిన్నప్పుడు మొటిమలు రాకూడదంటే.. ఒక రోజులో 1-2 మామిడి పండ్లు మాత్రమే తినాలి. ఇంతకు మించి మామిడి పండ్లను తీసుకుంటే మొటిమలే కాదు కడుపులో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా మామిడిపండ్లను తినడానికి ముందు ఓ రెండు గంటల సేపు నీటిల నానబెట్టడం ముఖ్యం. దీని వల్ల మామిడిలో వేడి గుణాలు తగ్గుతాయి. అలాగే మామిడి మీద రసాయనాలు ఉంటే అవి పోతాయి. అయితే మామిడి కాయలో పెరుగు కలిపి తినడం మానేయాలి. ఇది వేడిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి..

జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!

బాదం బంక ఎప్పుడైనా తిన్నారా? వేసవిలో దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 22 , 2024 | 05:20 PM