Share News

Late Night Sleep: ప్రతిరోజూ అర్దరాత్రి తరువాత నిద్రపోయే అలవాటుందా? అయితే మీకూ ఈ సమస్యలు రావడం పక్కా..!

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:01 PM

మొబైల్ బ్రౌజింగ్, చాటింగ్, సినిమాలు చూడటం వంటి వాటి వల్ల ఆలస్యంగా నిద్రపోతారు. ఇలాంటి వారిలో ఈ సమస్యలు పక్కా వస్తాయి.

Late Night Sleep: ప్రతిరోజూ అర్దరాత్రి తరువాత  నిద్రపోయే అలవాటుందా? అయితే మీకూ ఈ సమస్యలు రావడం పక్కా..!

నిద్ర గొప్ప ఔషదం అని ఆరోగ్యనిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. నిద్ర వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. అయితే ఇప్పటి యువత చాలావరకు నిద్రపోయే సమయం అర్ధరాత్రి దాటిన తరువాతే.. అర్ధరాత్రి వరకు మేలుకోవడం, మొబైల్ బ్రౌజింగ్, చాటింగ్, సినిమాలు చూడటం వంటి వాటి వల్ల ఆలస్యంగా నిద్రపోతారు. అయితే ఇలా అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రపోవడం వల్ల ఈ కింది తప్పకుండా వస్తాయి. అవేంటో ఓ లుక్కేస్తే..

స్లీప్ సైకిల్..

సిర్కాడియన్ రిథమ్ అనే నిద్రా చక్రం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది శరీరం కాంతికి లోనయ్యే పరిస్థితుల ఆధారంగా పనిచేస్తుంది. రాత్రి నిద్రపోవడం, ఉదయాన్నే మేల్కోవడానికి అనుగుణంగా ఇది ఉంటుంది. కానీ అర్ధరాత్రులు నిద్రపోవడం వల్ల ఈ నిద్రా చక్రం డిస్టర్బ్ అవుతుంది. దీని వల్ల రోజంతా అలసటగా, నీరసంగా, ఏ పని మీదా ఆసక్తి లేకుండా ఉండటం జరుగుతుంది.

ఇది కూడా చదవండి: walking: నడక వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుందా? రోజూ 4వేల అడుగులు నడిస్తే జరిగేదేంటంటే..!



రోగనిరోధక వ్యవస్థ..

రోగనిరోధక వ్యవస్థ చక్కగా ప్రతిస్పందించాలంటే మంచి నిద్ర చాలా అవసరం. గాఢమైన నిద్ర శరీరంలో సైటోకిన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లు ఇన్ప్లమేషన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. పేలవమైన నిద్ర వల్ల సైటోకిన్లు ఉత్పత్తి తగ్గి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకున్నా అది సరిగా పనిచేయదు.

బరువు పెరుగుతారు..

అర్ధరాత్రి నిద్రపోయేవారిలో ఎక్కువశాతం మంది బరువు పెరుగుతారు. ఆకలిని నియంత్రించే లెప్లిన్, గ్రెలిన్ లతో సహా ఇతర హార్మోన్ల సమతుల్యత ఆలస్యంగా నిద్రపోవడం వల్ల దెబ్బతింటుంది. దీని కారణంగా అధిక ఆకలి, ఎంత తిన్నా కడుపు నిండినట్టు అనిపించకపోవడం, ఫాస్ట్ ఫుడ్, కృత్రిమ జ్యూసులు వంటివి తాగాలని అనిపించడం జరుగుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారు.

ఇంపెయిర్డ్ కాగ్నిటివ్ ఫంక్షన్..

ఆలస్యంగా నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఇది జ్ఞాపకాలను ఒక్కటి చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, పనులమీద ఏకాగ్రత పెట్టడానికి, మెదడు సమాచారాన్ని సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి, వివరాలను గుర్తుంచుకోవడానికి ఆటంకాలు కలిగిస్తుంది.

ధీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం..

దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఆలస్యంగా నిద్రపోవడం కారణం అవుతుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి నిద్రలేమి సమస్య కారణమవుతుంది.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు ఈ 9పనులు చేస్తే చాలు.. పిల్లలలో కొండంత ఆత్మవిశ్వాసం నిండుకుంటుంది..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 06 , 2024 | 12:01 PM