Share News

Ladyfinger Water: మధుమేహం ఉన్నవారు బెండకాయలు నానబెట్టిన నీరురోజూ తాగితే జరిగేదేంటి?

ABN , Publish Date - May 01 , 2024 | 03:57 PM

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం బెండకాయ వల్ల సాధ్యమవుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. అసలు బెండకాయనీరు మధుమేహ రోగులకు ఎందుకు బాగా పనిచేస్తుంది . దీని ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

Ladyfinger Water: మధుమేహం ఉన్నవారు బెండకాయలు నానబెట్టిన నీరురోజూ తాగితే జరిగేదేంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే షుగర్ లెవెల్ పెరిగిపోవచ్చు. సాధారణంగా షుగర్ లెవెల్ కంట్రోల్ పెట్టుకోవడానికి మందులు వాడుతుంటారు. ఇలా మందులు వాడితే అవి వాడినప్పుడు బానే ఉంటుంది కానీ ఆ తరువాత మళ్లీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతుంటాయి. అయితే మందుల అవసరం లేకుండా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం బెండకాయ వల్ల సాధ్యమవుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. అసలు బెండకాయనీరు మధుమేహ రోగులకు ఎందుకు బాగా పనిచేస్తుంది తెలుసుకుంటే..

బెండకాయను సాధారణంగా వంటలలో వాడుతుంటారు. కానీ బెండకాయను నానబెట్టిన నీరు మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఇది చాలా మేలు చేస్తుంది.

మానసికంగా బలంగా ఉన్నవారిలో ఉండే 8 లక్షణాలు ఇవీ..!


దీర్ఘకాలిక మధుమేహం లక్షణాలను తగ్గించడానికి బెండకాయ నీరు చాలా మంచిది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో కలిపి జీవక్రియను ప్రోత్సహిస్తుంది. కండరాల ద్వారా చక్కెర శోషణను పెంచుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది.

బెండకాయ నీటిలో తగినంత మొత్తంలో విటమిన్ ఎ, సి ఉంటుంది. ఇది ఒత్తిడి, కాలుష్యం వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం పొడిబారడం, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బెండకాయ నీటిలో ఉండే ఫినాలిక్ సన్ బర్న్ అయిన చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది ముఖాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, మచ్చల గుర్తులు కూడా తగ్గుతాయి.

మానసికంగా బలంగా ఉన్నవారిలో ఉండే 8 లక్షణాలు ఇవీ..!

30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం... ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 01 , 2024 | 03:57 PM