Share News

Irregular Periods: నెలసరి కరెక్ట్ గా రావడం లేదా? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేసి చూడండి..!

ABN , Publish Date - May 25 , 2024 | 04:54 PM

చాలామంది మహిళలు నెలసరి సరైన తేదీల్లో రాక ఇబ్బంది పడుతుంటారు. కొందరికి రోజుల వ్యవధిలో ఆలస్యం జరిగితే.. మరికొందరికి వారాల వ్యవధిలో ఆలస్యం జరుగుతుంది. ఈ నెలసరి సరైన సమయానికి రాకపోతే మహిళలు చాలా ఒత్తిడి ఎదుర్కుంటారు. దీని వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

Irregular Periods:  నెలసరి కరెక్ట్ గా రావడం లేదా?  ఈ ఇంటి చిట్కాలు ట్రై చేసి చూడండి..!

నెలసరి ప్రతి మహిళకూ తప్పనిసరిగా ఎదురయ్యేదే. అయితే చాలామంది మహిళలు నెలసరి సరైన తేదీల్లో రాక ఇబ్బంది పడుతుంటారు. కొందరికి రోజుల వ్యవధిలో ఆలస్యం జరిగితే.. మరికొందరికి వారాల వ్యవధిలో ఆలస్యం జరుగుతుంది. ఈ నెలసరి సరైన సమయానికి రాకపోతే మహిళలు చాలా ఒత్తిడి ఎదుర్కుంటారు. దీని వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అయితే నెలసరి సరిగా రావడానికి కొన్ని ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..

బెల్లం, వాము..

పీరియడ్స్ రాకపోతే బెల్లం , వాము తీసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా బెల్లం, ఒక చెంచా వాము గింజలు కలపాలి. ఈ నీటిని మరిగించి వడగట్టి కప్పులోకి తీసుకోవాలి. దీన్ని ఉదయం 1-2 రోజులు త్రాగాలి. ఇలా చేస్తే ఆలస్యం అయిన పీరియడ్స్ 2,3 రోజుల్లో వస్తాయి.

వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!


బొప్పాయి..

పీరియడ్స్ మిస్ అయ్యే సమస్యకు బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పచ్చి బొప్పాయి తింటే పీరియడ్స్ వస్తాయి. బొప్పాయి తింటే గర్భాశయంలో సంకోచాలు మొదలవుతాయి. ఇది పీరియడ్స్‌కు దారితీస్తుంది. కావాలంటే బొప్పాయి జ్యూస్ కూడా తాగవచ్చు.

అల్లం..

ఆయుర్వేద గుణాలు కలిగిన అల్లం తీసుకోవడం వల్ల పీరియడ్స్ సకాలంలో వస్తాయి. అల్లం తీసుకుంటే గర్భాశయంలో వేడి ఏర్పడుతుంది. సంకోచాలు ఏర్పడతాయి. దీని కారణంగా పీరియడ్స్ వస్తాయి. అల్లం టీ తయారు చేసి తాగవచ్చు. తాజా అల్లం ముక్కలను ఒక గ్లాసు నీటిలో వేసి ఉడికించి తాగవచ్చు. అంతే కాకుండా అల్లం రసంలో కొద్దిగా నీరు కలుపుకుని తాగవచ్చు. కావాలంటే అల్లం రసంలో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది పీరియడ్స్ రావడానికి సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!


దనియాలు..

పీరియడ్స్ సరిగా రాకపోతే దనియాలు కూడా బాగా సహాయపడతాయి. 2 కప్పుల నీటిలో ఒక చెంచా దనియాలు వేసి ఉడికించాలి. నీరు బాగా ఉడికి సగానికి తగ్గినప్పుడు స్టౌ ఆప్ చేసి వడగట్టాలి. ఈ నీటిని రోజుకు 2 నుండి 3 సార్లు త్రాగితే పీరియడ్స్ వస్తాయి.

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!

వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 25 , 2024 | 04:54 PM