Share News

Heart Health: ఈ 5 ఆహారాలు తింటే చాలు.. మీ గుండె సేఫ్..!

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:14 PM

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను దృఢంగా మార్చే ఆహారాలున్నాయి. వీటిని తీసుకుంటే మీ గుండె సేఫ్..

Heart Health: ఈ 5 ఆహారాలు తింటే చాలు.. మీ గుండె సేఫ్..!

మనం ఏం తింటున్నాం అనే దాని మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. తీసుకునే ఆహారమే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచగలుగుతుంది. నేటికాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ గుండె సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం కూడా దీనికి కారణమని ఆహార నిపుణులు అంటున్నారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను దృఢంగా మార్చే ఆహారాలున్నాయి. ఈ ఆహారాలు తీసుకుంటే గుండెకు ఎలాంటి గండం దరిచేరదు. ఆ ఆహారాలేంటో తెలుసుకుంటే..

పండ్లు, కూరగాయలు..

కూరగాయలు, పండ్లలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. తక్కువ క్యాలరీలతో పాటు, వీటిలో అధిక డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులను నివారించడం సులువు అవుతుంది.

ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో బిర్యానీ ఆకు నమలడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?


తృణధాన్యాలు..

తృణధాన్యాలలో ఫైబర్, అవసరమైన బోలెడు పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. ఆహారంలో ఎక్కువగా తృణధాన్యాలు తీసుకోవాలి. శుద్దిచేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

అవిసె గింజలు..

లినోలెనిక్ యాసిడ్ వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అవిసె గింజలలో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. అవిసె గింజల్లో ఉండే కరిగే, కరగని ఫైబర్‌లు బరువును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

బాదం..

బాదం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఇందులో ఉంటాయి. ఇది చాలా వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని మితంగా తీసుకోవాలి.

టోపు..

టోఫులో ప్రోటీన్ సమృద్దిగా ఉండటమే కాదు.. నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ఆరోగ్యకరమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. టోఫులో కాల్షియం కూడా మంచి మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 08 , 2024 | 04:14 PM