Share News

Health Tips: 30రోజుల పాటూ టీ, కాఫీ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:10 PM

చాలామందికి కాఫీ, టీ లు లేకపోతే రోజు గడవదు. అయితే వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగానే ఈమధ్య కాఫీ, టీ ల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడం మొదలు పెట్టారు ఆహార నిపుణులు.

Health Tips: 30రోజుల పాటూ టీ, కాఫీ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో టీ, కాఫీతో రోజు ప్రారంభమవుతుంది. పొద్దున లేచిన వెంటనే టీ, కాఫీలు తాగే అలవాటు చాలా పాతది. చాలా మంది పాలు, చక్కెరతో కాఫీ-టీని త్రాగడానికి ఇష్టపడతారు. చాలామందికి కాఫీ, టీ లు లేకపోతే రోజు గడవదు. అయితే వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగానే ఈమధ్య కాఫీ, టీ ల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడం మొదలు పెట్టారు ఆహార నిపుణులు. ఒక నెల పాటు టీ, కాఫీలను తాగడం మానేస్తే ఏం జరుగుతుందో.. శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసుకుంటే..

రక్తపోటు అదుపులో ఉంటుంది ..

టీ, కాఫీ తాగడం వల్ల కొన్ని నిమిషాల పాటు శరీర అలసట నుండి ఉపశమనం పొందవచ్చు. కానీ టీ రక్తపోటును కూడా పెంచుతుంది. టీ, కాఫీలో ఉండే అధిక రక్తపోటు పెంచుతుంది. 1 నెల పాటు టీ లేదా కాఫీ తాగడం మానేస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది.

వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!


షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది

టీ, కాఫీ తాగడం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయి చాలా వరకు నియంత్రణలో ఉంటుంది. చక్కెర కలిపిన టీ , కాఫీని తీసుకుంటే అది రక్తంలో చక్కెరను పెంచే అవకాశం ఉంది. ఇక టీ, కాపీలలో ఉండే కెఫీన్ రక్తంలో చక్కెర స్థాయిని, దానికి సంబంధించిన సమస్యలను కూడా పెంచుతుంది. నెలరోజులు టీ, కాఫీ మానేస్తే షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.

ప్రశాంతమైన నిద్ర వస్తుంది

ఒక నెల పాటు టీ, కాఫీలను తాగడం మానేస్తే నిద్ర సమస్యలు తగ్గుతాయి. గాఢమైన నిద్రను పొందుతారు. టీలో కెఫిన్ ఉంటుంది ఇది మెదడును చురుకుగా ఉంచుతుంది. ఈ కారణంగా కాఫీ,టీ లు తాగుతుంటే నిద్ర సరిగా రాదు.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!


దంతాల ఆరోగ్యం

ఒక నెల పాటు కెఫిన్ ఉన్న పానీయాలు తాగకపోవడం వల్ల దంతాలు కూడా శుభ్రం అవుతాయి. నిజానికి టీ, కాఫీలు కొద్దిగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఇవి దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దంతాలలో జలదరింపు, తెల్లదనంపై ప్రభావం ఉంటుంది. కాఫీ, టీ మానేస్తే ఈ సమస్యలుండవు.

బరువు తగ్గుతారు

1 నెల పాటు టీ, కాఫీని మానేయడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. ఇందులో ఉండే చక్కెర శరీర బరువును పెంచుతుంది. కెఫిన్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది.అందుకే టీ, కాఫీని మానేయడం ఆరోగ్యానికి మంచిది.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!

వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 05:10 PM