Share News

Health Tips: బాబోయ్.. రాత్రి మిగిలిపోయే రొట్టెలకు ఇంత పవరుందా? డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇవి తింటే ఏం జరుగుతుందంటే..!

ABN , Publish Date - May 27 , 2024 | 04:42 PM

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. పెద్దా చిన్నా తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నవారు ఉన్నారు. డయాబెటిక్ రోగులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వీరు ఆహారంలో ఎక్కువగా రొట్టెలు తీసుకుంటూ ఉంటారు. అయితే తాజా రొట్టెలు కాకుండా ముందురోజు రాత్రి మిగిలిపోయిన రొట్టెలు తీసుకుంటే..

Health Tips: బాబోయ్.. రాత్రి మిగిలిపోయే రొట్టెలకు  ఇంత పవరుందా? డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇవి తింటే ఏం జరుగుతుందంటే..!

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. పెద్దా చిన్నా తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నవారు ఉన్నారు. డయాబెటిక్ రోగులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వీరు ఆహారంలో ఎక్కువగా రొట్టెలు తీసుకుంటూ ఉంటారు. అయితే తాజా రొట్టెలు కాకుండా ముందురోజు రాత్రి మిగిలిపోయిన రొట్టెలు తీసుకోవడం వల్ల షాకింగ్ ఫలితాలుంటాయి. ఇలా ముందు రోజు రాత్రి మిగిలిన రొట్టెలను బాసి రొట్టెలు అంటారు. ఇవి తింటే మధుమేహం ఉన్నవారికి కలిగే ప్రయోజనం ఏంటి? వీటిని ఎలా తినాలి? తెలుసుకుంటే..

ముందు రోజు రొట్టెలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీన్ని ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు.

ధ్యానం చేయడం కష్టంగా అనిపిస్తోందా? ఇలా ఈజీగా చేసేయచ్చు..!


ముందురోజు చేసిన రొట్టెలను ఒక రోజంతా అలాగే ఉంచాలి. ఇలా చేస్తే రొట్టెలు గట్టిపడతాయి. వీటిలో పైబర్ అధికంగా ఉంటుంది. ఈ రొట్టెలను పాలలో 10-15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ రొట్టెలు మెత్తబడిన తరువాత వీటిని తినవచ్చు.

ముందు రోజు రొట్టెలను పాలలో నానబెట్టి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

ముందురోజు రొట్టెలను పాలలో నానబెట్టి తింటే కడుపు చల్లబడుతుంది. ఈ కారణంగా ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది.

ధ్యానం చేయడం కష్టంగా అనిపిస్తోందా? ఇలా ఈజీగా చేసేయచ్చు..!

మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 27 , 2024 | 05:27 PM