Share News

Gut Health: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. వేసవికాలంలో గట్ ఆరోగ్యం సేఫ్..!

ABN , Publish Date - Apr 15 , 2024 | 03:31 PM

వేసవికాలంలో పేగు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

Gut Health: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. వేసవికాలంలో గట్ ఆరోగ్యం సేఫ్..!

వేసవి కాలం వచ్చిందంటే చాలామంది లైప్ స్టైల్ మారిపోతుంది. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి కోలాలు, చల్లని పానీయాలు, స్ట్రీట్ ఫుడ్స్ వంటి వాటి మీద ఆధారపడతారు. అప్పటికే ఉన్న ఎండ వేడిమికి ఆహారం కూడా మారిపోవడంతో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా అతిసారం, వాంతులు, జీర్ణాశాంతర సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. వీటి మధ్యన పేగు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. పేగు ఆరోగ్యాన్ని సేఫ్ గా ఉంచే 5 వేసవికాల టిప్స్ గురించి తెలుసుకుంటే..

వేసవికాలంలో శరీరంలో తేమ శాతం చాలా తొందరగా తగ్గిపోతుంది. ఇది శరీరాన్ని దారుణంగా బలహీనపరుస్తుంది. అందుకే ఎల్లప్పుడూ శరీరం హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: రోజూ బొడ్డులో కొన్ని చుక్కల నూనె వేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా?


వేసవికాలంలో శరీరం తొందరగా అలసిపోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా తక్కువ ఉంటుంది. సీజనల్ వ్యాధులతో పోరాడటానికి రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. తులసి, నల్ల మిరియాలు,శొంఠి, ఎండు ద్రాక్షతో చేసిన హెర్బల్ టీని తీసుకోవాలి. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది.

పెరుగు, పెరుగు సంబంధిత పదార్థాలను బాగా తీసుకోవాలి. ఇడ్లీ, దోశ వంటి పులియబెట్టిన ఆహారాలు తీసుకోవాలి. పెరుగును ప్రోబయోటిక్స్ అంటారు. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేసే బ్యాక్టీరియాను అభివృద్ది చేసి జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఫైబర్ అధికంగా ఉండే పచ్చి కూరగాయలు, ఊక, తృణధాన్యాలు, రొట్టెలు తీసుకోవాలి. అదేవిధంగా అరటిపండ్లు, యాపిల్స్ వంటి తాజా పండ్లు తీసుకోవాలి. ఇవి ప్రేగు ఆరోగ్యానికి మంచివి. అలాగే పాలకూర, బచ్చలికూర, నిమ్మరసంకూడా తీసుకోవాలి.

జంక్ ఫుడ్, స్పైసీ తింటే ప్రేగు ఆరోగ్యం పాడైపోతుంది. ఇక వేసవిలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ ఉంటుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ అస్తవ్యస్థం అవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 15 , 2024 | 03:31 PM