రోజూ బొడ్డులో కొన్ని చుక్కల నూనె వేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా?

బొడ్డులో నూనె వేస్తే బొడ్డు చుట్టూ ఉన్న చర్మం హైడ్రేట్ అవుతుంది.  ఇది చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది.

కొన్ని చుక్కల నూనె వేసి బొడ్డును మసాజ్ చేయడం వల్ల పొట్టభాగంలో కణజాలాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. పోషకాల పంపిణీ బాగుంటుంది.

బొడ్డులో నూనె వేసి మసాజ్ చేస్తే ఒత్తిడిని నియంత్రించే  హార్మోన్ అయిన ఎండార్పిన్ విడుదల అవుతాయి. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

బొడ్డుకు, జీర్ణవ్యవస్థకు లింక్ ఉంటుంది. బొడ్డుకు మసాజ్ చేయడం వల్ల జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది.

బొడ్డు భాగం శరీరానికి శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. బొడ్డులో నూనె వేస్తే శరీరం మొత్తం సమతల్యంగా ఉంటుందని భావిస్తారు.