Share News

Green Tea: గ్రీన్ టీ గురించి మీకెంత తెలుసు? దీని లాభనష్టాలేంటంటే..!

ABN , Publish Date - May 06 , 2024 | 03:12 PM

బరువు తగ్గాలని ట్రై చేస్తున్నవారు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది. అందుకే ఇది బెస్ట్ పానీయంగా పరిగణింపబడుతోంది. చేదు రుచితో ఉండే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అయితే గ్రీన్ టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు..

Green Tea: గ్రీన్ టీ గురించి మీకెంత తెలుసు? దీని లాభనష్టాలేంటంటే..!

గ్రీన్ టీ.. ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న పానీయం. కాపీ, టీలను పక్కకు తోసి ప్రజలకు ఇష్టమైన పానీయంగా మారుతోంది. బరువు తగ్గాలని ట్రై చేస్తున్నవారు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది. అందుకే ఇది బెస్ట్ పానీయంగా పరిగణింపబడుతోంది. చేదు రుచితో ఉండే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అయితే గ్రీన్ టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ లాభనష్టాల గురించి పూర్తీగా తెలుసుకుంటే..

పోషకాలు..

గ్రీన్ టీ లో 99.9 శాతం నీరు ఉంటుంది. ఇందులో ప్రోటీన్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ B-6, కెఫిన్ ఉంటాయి.

గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!


ప్రయోజనాలు..

గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో చక్కగా పనిచేస్తాయి.

గ్రీన్ టీ లో ఉండే కెఫీన్, అమైనో యాసిడ్ లు ఎల్-థియనైనే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు మానసిక స్థితిని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. చిత్తవైకల్యం, అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

గ్రీన్ టీలో కార్బోహైడ్రేట్స్ లేదా చక్కెరలు ఉండవు. ఈ కారణంగా బరువు పెరిగే అంశాలేవీ ఇందులో ఉండవు. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

గ్రీన్ టీని రోజూ తాగుతుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్‌లు కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది. టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!


దుష్ప్రభావాలు..

గ్రీన్ టీ ఎక్కువ తాగితే నిద్రలేమి, చికాకు, హృదయ స్పందన పెరగడం వంటి కెఫిన్ సంబంధిత సమస్యలు వస్తాయి.

గ్రీన్ టీ ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఐరన్ లోపం అనీమియా ఉన్న వ్యక్తులపై ప్రభావం చూపుతుంది.

అధిక కెఫిన్ తీసుకోవడం సున్నితమైన వ్యక్తులలో తలనొప్పిని ప్రేరేపిస్తుంది.

కాల్షియం శోషణను దెబ్బతీస్తుంది, ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

గ్రీన్ టీలో కెఫిన్ స్థాయిల కారణంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది గర్భధారణ సమయంలో ప్రమాదాలను కలిగిస్తుంది.

ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!

గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లికే చేయండి.

Updated Date - May 06 , 2024 | 03:12 PM