ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!

అయే-అయే.. మడగాస్కర్ లో రాత్రిపూట మాత్రమే కనిపించే లెమర్ ఇది. కీటకాలను తీయడానికి సన్నగా ఉండే మధ్యవేలును ఉపయోగిస్తాయి. పెర్కషన్ ఫోరేజింగ్ అనే ప్రత్యేకమైన ఆహారంలో నిమగ్నమై ఉంటుంది.

కొడోమో డ్రాగన్.. ఇండోనేషియా దీవులైన గిలి మోటాంగ్, కొమోడో ఫోర్స్ లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. 

ఒకాపి.. దీన్ని ఆఫ్రికన్ యూనికార్న్ అని కూడా పిలుస్తారు.  ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన శాకాహార క్షీరదం.

పాంగోలిన్లు.. ఇవి అసాధారణమైన క్షీరదాలు.  వీటిని వేటాడాలని చూస్తే రక్షణ కోసం బంతిలాగా శరీరాన్ని మార్చేస్తాయి.

ప్లాటిపస్.. పాటిపస్ ఒక క్షీరదం. ఆస్ట్రేలియాలో కనిపించే ఇది బాతును పోలి ఉంటుంది. ఇది విషాన్ని ఉత్పత్తి చేస్తుందని అంటారు.

ఆక్సోలొట్ల్స కల్పోయిన శరీర భాగాలను తిరిగి ఉత్పత్తి చేస్తాయివి. ఇవి ఉభయచర జీవులు. వీటి మొప్పలు ఈకలను పోలి ఉంటాయి.

నార్వేల్స్ లు.. ఇవి సముద్రపు క్షీరదాలు. వీటి తల పై భాగంలో పొడవాటి దంతాలు ఉంటాయి. అందుకే వీటిని సముద్రపు యూనికార్న్ అంటారు.