Share News

Garlic: ఆరోగ్యానికి మంచిది కదా అని వెల్లుల్లి ఎక్కువ వాడుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:56 AM

వెల్లుల్లి దివ్యౌషదం అని, వెల్లుల్లి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసు.. కానీ ఎక్కువ తింటే జరిగేదిదే..

Garlic: ఆరోగ్యానికి మంచిది కదా అని వెల్లుల్లి ఎక్కువ వాడుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!

ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే పదార్థం వెల్లుల్లి. ఆయుర్వేదంలో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లి బాగాతీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటూ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు కంట్రోల్ లో ఉండటానికి, సీజనల్ సమస్యలు తగ్గించడంలోనూ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచడంలోనూ వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం ముప్పు తప్పదని ఆహార నిపుణులు, వైద్యులు అంటున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో వేడి గుణం ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్ఫ్రభావాలేంటో ఓ లుక్కేస్తే..

రక్తస్రావం..

వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హనికరం. ఇందులో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. శస్ర్తచికిత్స చేయించుకోవాల్సిన వారు, రక్త సంబంధ సమస్యలున్నవారు వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోకూడదు.

ఇది కూడా చదవండి: పాలతో ఈ పదార్థాలను కలిపి తీసుకుంటే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!


గుండెల్లో మంట..

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు వెల్లుల్లిని ఎక్కువగా తినడం హానికరం. కడుపు ఆమ్లాలు అన్నవాహికలోకి తిరిగి వెళ్ళినప్పుడు గుండెల్లో మంట సమస్య పెరుగుతుంది. వెల్లుల్లి దిగువ అన్నవాహిక కండరం అయిన స్పింక్టర్ ని ప్రభావితం చేస్తుంది. యాసిడ్ లోపలికి రాకుండా చేస్తుంది.

జీర్ణసమస్యలు..

వెల్లుల్లిని ఎక్కువగా తినేవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. వెల్లుల్లిలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది ఒక రకమైన కార్బ్. గ్యాస్, కడుపు నొప్పికి కారణమవుతుంది, ఫ్రక్టోజ్ అసహనం ఉన్నవారు అధిక ఫ్రక్టోజ్ ఆహారాన్ని తినేటప్పుడు అది చిన్న ప్రేగులలో పూర్తిగా శోషించబడకపోవచ్చు. బదులుగా ఇది పెద్దప్రేగులోకి వెళుతుంది మరియు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

నోటి దుర్వాసన..

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే అయినా వెల్లుల్లి తింటే నోటి దర్వాసన సమస్య ఎక్కువ అవుతుంది. నలుగురిలో మాట్లాడాలన్నా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే వెల్లుల్లి ఘాడత ఎక్కువగా ఉంటుంది. దీని వాసన అంత తొందరగా వదలదు.

చర్మ సంబంధ సమస్యలు..

వెల్లుల్లి వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతం తగ్గిపోయేలా చేస్తుంది. ఈ కారణంగా చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. దురదలు, దద్దుర్లు వస్తాయి.

ఇది కూడా చదవండి: Health Tips: ఈ 4 మొక్కలను ఇంట్లో పెంచుకుంటే చాలు.. ఎన్ని లాభాలుంటాయంటే..!


మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2024 | 11:56 AM