Share News

Face Glow: ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బ్యూటీ పార్లర్ తో అవసరం లేకుండా ముఖం మిలమిలా మెరుస్తుంది..!

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:59 PM

అందంగా కనిపించడం అమ్మాయిలకు అందరికీ ఇష్టం. దీనికోసం ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా ముఖాన్ని మెరిపిస్తాయి. ఆ తరువాత ముఖం డ్యామేజ్ అవుతుంది. దాని బదులు ఇలా చేస్తే ముఖం మిలమిలా మెరిసిపోతుంది.

Face Glow: ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బ్యూటీ పార్లర్ తో అవసరం లేకుండా ముఖం మిలమిలా మెరుస్తుంది..!

అందంగా కనిపించడం అమ్మాయిలకు అందరికీ ఇష్టం. దీనికోసం ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా ముఖాన్ని మెరిపిస్తాయి. ఆ తరువాత ముఖం డ్యామేజ్ అవుతుంది. ముఖ చర్మాన్ని సహజంగా క్లీన్ చెయ్యడంలోనూ, చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలోనూ ముఖనికి ఆవిరి పట్టడం గొప్పగా సహాయపడుతుంది. ఇది చర్మ రంధ్రాలను డీప్ గా క్లీన్ చేస్తుంది. అయితే సాధారణంగా ముఖానికి ఆవిరి పట్టకుండా నీటిలో కొన్ని ప్రత్యేక పదార్థాలు వేసి ఆ ఆవిరి పట్టుకోవడం వల్ల ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది. అవేంటో తెలుసుకుంటే..

దోసకాయ..

దోసకాయ ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి. నీరు బాగా మరిగిన తరువాత ఈ నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఇందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ కూడా వేయచ్చు. దీని నుండి వచ్చే ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. నూనె, దుమ్ము, ధూళి కారణంగా మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు క్లియర్ అవుతాయి.

ఇది కూడా చదవండి: Health Tips: శరీరంలో వాపు సమస్యలు వేధిస్తున్నాయా? ఆయుర్వేదం చెప్పిన ఈ ఆహారాలు ట్రై చేస్తే..!



నిమ్మకాయ..

నిమ్మకాయ చర్మ సంరక్షణలో చాలా విధాలుగా ఉపయోగిస్తారు. అయితే మరుగుతున్న నీటిలో పిండేసిన నిమ్మతొక్కలు, గ్రీన్ టీ బ్యాగ్ లేదా టీ ఆకులు వేయాలి. నీటిని దించాక దీంట్లో కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఈ ఆవిరిని ముఖానికి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. చర్మం మీద ఉన్న మృత కణాలు, మురికి క్లీన్ అవుతాయి.

సొంపు.. బిర్యానీ ఆకులు..

ముందుగా బిర్యానీ ఆకులు, 1 టీస్పూన్ సొంపు మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత వేడినీళ్లలో వేసి మరికొంత సేపు మరిగించాలి. ఇందులో కొన్ని చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. తర్వాత ఆవిరి పట్టాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.

వేప ఆకులు..

ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో 5 నుంచి 7 వేప ఆకులను వేసి ఆ నీటిని మరిగించాలి. ఈ నీటిలో కొన్ని తులసి ఆకులను కూడా జోడించవచ్చు. నీరు బాగా మరిగిన తరువాత దించేసి ఆవిరి పట్టాలి. ఇవి మూసుకుపోయిన రంధ్రాలను తెరవడంలో సహాయపడతాయి. అయితే ముఖానికి పట్టే ఏ ఆవిరి అయినా సరే చాలా ఎక్కువ వేడిగా ఉండకూడదు. లేకపోతే ముఖ చర్మం కందిపోయి ఎర్రగా మారి సెన్సటీవ్ గా మారిపోతుంది.

ఇది కూడా చదవండి: ఈ 8 కొరియన్ డ్రింక్స్ ఎంత పవరంటే.. బరువును ఐస్ లా కరిగిస్తాయ్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 02:59 PM