Share News

Health Tips: శరీరంలో వాపు సమస్యలు వేధిస్తున్నాయా? ఆయుర్వేదం చెప్పిన ఈ ఆహారాలు ట్రై చేస్తే..!

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:27 PM

చాలామంది వాపులను లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆహారాలు తీసుకుంటే వాపు సమస్యలు తగ్గుతాయి.

Health Tips: శరీరంలో వాపు సమస్యలు వేధిస్తున్నాయా? ఆయుర్వేదం చెప్పిన ఈ  ఆహారాలు ట్రై చేస్తే..!

చాలామంది శరీరంలో కొన్ని ప్రాంతాలలో వాపు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వీటని పెద్దగా సీరియస్ గా కూడా తీసుకోరు. సాధారణంగా వాపు గాయం లేదా నొప్పి కారణంగా వస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది కాలేయ వ్యాధి లక్షణంగా కూడా పరిగణించబడుతుంది. ఈ సమస్యను తేలికగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుంది. చర్మం, కీళ్లతో పాటు శరీరంలోని కణజాలాలు, అవయవాలలో కూడా వాపు వస్తుంది. సాధారణంగా వాపు వచ్చినప్పుడు అది తగ్గడానికి పెయిన్ కిల్లర్లు, ఐస్ ప్యాక్ లేదా హీట్ ప్యాక్ పెడుతుంటారు. కానీ ఈ వాపుల సమస్య తగ్గాలంటే ఆయుర్వేదం సూచించిన కింది ఆహారాలు తీసుకోవడం చాలామంచిది. అవేంటో తెలుసుకుంటే..

నెయ్యి ..

నెయ్యి ఆహారంలో తీసుకోవాలంటే చాలా మంది ఆలోచిస్తారు. కానీ దీన్ని అధిక మొత్తంలో కాకుండా తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. లేదా వేడి నీటిలో కలుపుకుని త్రాగవచ్చు. అటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను, ఇటు వాపుల సమస్యను తగ్గించుకోవచ్చు.

పసుపు..

వాపు సమస్యను దూరం చేయడానికి చిటికెడు పసుపును తీసుకుంటే సరిపోతుంది. దీనిని ప్రత్యేకంగా కాకుండా వంటల్లో తీసుకోవచ్చు. లేదంటే పసుపు కలిపిన పాలు కూడా తాగచ్చు. పసుపును చిన్న గోళీల్లా చేసి పరగడుపునే తీసుకోవచ్చు. ఇది అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పెసరపప్పు..

పెసరపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది వాపును తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పెసరపప్పులో జీలకర్ర, ఇంగువ కలిపి పోపు పెట్టి ఆహారంతో తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి.

దానిమ్మ..

దానిమ్మ శరీరానికి చల్లదనాన్ని అందించి వాపుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. దీన్ని గింజలు వలిచి నేరుగా తినవచ్చు, లేదంటే జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఫలితాలుంటాయి.

ఉసిరికాయ..

ఉసిరి కాయ వాపులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదంటే జ్యూస్ రూపంలోనూ, జామ్, మురబ్బా, ఊరగాయ, క్యాండీ ఇలా చాలా రకాలుగా తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా ఉసిరికాయను తీసుకుంటే వాపు సమస్య కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతుంది.

ఇది కూడా చదవండి: Asafoetida: వంటల్లో వాడే ఇంగువ వల్ల ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే..


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 01:27 PM