Share News

Heart Attacks: గుండెపోటు ముందు వచ్చే సంకేతాలివే..

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:44 PM

ఇటీవల యువత నుంచి వృద్ధుల వరకు గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఎన్నో నమోదయ్యాయి. అయితే అకస్మాత్తుగా వచ్చే ఈ గుండెపోటుతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. హార్ట్ ఎటాక్ రాకముందే గుండె లయల్లో మార్పులు కనిపిస్తాయని.. వాటిని గమనించి అప్రమత్తమైతే ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్లు అంటున్నారు.

Heart Attacks: గుండెపోటు ముందు వచ్చే సంకేతాలివే..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల యువత నుంచి వృద్ధుల వరకు గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఎన్నో నమోదయ్యాయి. అయితే అకస్మాత్తుగా వచ్చే ఈ గుండెపోటుతో(Heart Attack) క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. హార్ట్ ఎటాక్ రాకముందే గుండె లయల్లో మార్పులు కనిపిస్తాయని.. వాటిని గమనించి అప్రమత్తమైతే ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్లు అంటున్నారు.

Patna: క్యాన్సర్ బారిన పడిన మాజీ ఉపముఖ్యమంత్రి.. ఆందోళనలో అభిమానులు

ఓ పరిశోధన ప్రకారం .. ఏడాదికి దాదాపు 45 శాతం మంది ప్రజలు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొందరిలో కొన్ని వారాలపాటు గుండె లయల్లో మార్పులు సంభవించినట్లు పరిశోధనలు వెల్లడించాయి. గుండెపోటు రావడానికి సుమారు 4 నుంచి 6 రోజుల ముందు వరకు ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, అలసట వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు.


50 శాతం కంటే ఎక్కువ మంది రోగులు గుండెపోటు సంభవించే కనీసం 48 గంటల ముందు ఛాతీ నొప్పి రూపంలో ప్రోడ్రోమల్ లక్షణాలను కలిగి ఉంటున్నారు. మహిళల్లో ఛాతి నొప్పి ఉండకపోవచ్చు. బదులుగా గుండెపోటు సంభవించే రోజుల్లో వికారం, అజీర్ణం, వెన్నునొప్పి వంటి లక్షణాలను అనుభవించవచ్చు.

ఈ సంకేతాలను గమనించడం ముఖ్యమని యశోద ఆసుపత్రి వైద్యులు చెప్పారు. "గుండెపోటు సంభవించే ముందు లక్షణాలను గుర్తిస్తే సకాలంలో వైద్య సహాయం అందించవచ్చు. ఇది ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అప్రమత్తతతో సకాలంలో వైద్యం అందిస్తే గుండెపోటు మరణాలను తగ్గించవచ్చు" అని వివరించారు. పై లక్షణాల్లో ఏవి కనిపించినా.. డాక్టర్ ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 03:45 PM