Share News

Chapathi: చపాతీలను నేరుగా మంటపై పెట్టి కాలుస్తున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలిస్తే..

ABN , Publish Date - Feb 12 , 2024 | 06:49 PM

చపాతీలను నేరగా మంటపై ఉంచి కాల్చితే పెను ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Chapathi: చపాతీలను నేరుగా మంటపై పెట్టి కాలుస్తున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: చపాతీలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. డయాబెటిక్ పేషెంట్లకు ఇవి అమృతంతో సమానం. చపాతీల్లో పీచు పదార్థం, కాల్షియం, ప్రొటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది తిన్న తరువాత చాలా సేపటివరకూ ఆకలేయదు కాబట్టి బరువు నియంత్రణలో ఉంటుంది.

ఇక సాధారణంగా చపాతీలను పెనంపై పెట్టి కాలుస్తాం. కొందరు మాత్రం నేరుగా మంటపై పెట్టి చపాతీలు చేస్తారు. కానీ ఈ పద్ధతి చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు (Cooking rotis on direct gas flame can be dangerous).

నిపుణులు తెలిపిన దాని ప్రకారం, స్టవ్‌లోంచి వచ్చే మంటలో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజెన్ డైయాక్సైడ్, సూక్ష్మమైన దుమ్మ కణాలు బోలెడన్ని ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళితే అనారోగ్యానికి దారితీస్తాయి.

Viralvideo: ఈ డాల్ఫిన్‌కు ఎంత తెలివి! సముద్రంలో కుక్క మునిగిపోతోందని గుర్తించిన వెంటనే..


అంతేకాకుండా, ఆహారాన్ని నేరుగా మంటపై పెట్టి వండితే ఫుడ్‌లో క్యాన్సర్ కారక రసాయనాలు పుట్టుకొస్తాయి. ఆహారం పైరోలిసిస్ అనే ప్రక్రియకు లోనై ఈ క్యాన్సర్ కారకాలు తయారవుతాయి.

కొందరు మాంసం, లేదా ఇతర ఆహారాలను గ్రిల్ చేసేందుకు ఇష్టపడతారు. ఇలాంటి సందర్భాల్లో పాలీఎక్రిలిక్ అరోమేటిక్ హైడ్రోకార్బన్స్, హెటిరోసైక్లిక్ అమైన్స్ వంటి హానికారక రసాయనాలు విడుదల అవుతాయి. కాబట్టి, నేరుగా మంటపై చపాతీలు లేదా ఇతర ఆహారాలను వండొద్దని నిపుణులు చెబుతున్నారు.

మూకుడు లేదా పెనంపై ఆహారం వండితే వేడి మొత్తం సమతులంగా పరుచుకుని చపాతీలు తీరుగా తయారవుతాయి. అంతేకాకుండా, పిండిలోని పోషకాలు యథాతథంగా నిలిచి ఉంటాయి. పెనంపై వండటంతో నూనె కూడా తక్కువ అవసరం పడుతుంది. దీంతో, కొవ్వు పెరగదు. కాబట్టి చపాతీలను నేరుగా మంటపై కాల్చొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Viral: ‘ప్లీజ్.. పిల్లల్ని కనండి! ఒక్కో బిడ్డకు రూ.62 లక్షలు చొప్పున ఇస్తాం..’

Viral: అసలీ ఆర్టీసీ బస్సుల్లో ఏం జరుగుతోంది? ఈ మహిళలను చూడండి.. ఎవరు చెప్పినా ఆగకుండా..

Viral: ఈ డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా! యాక్సిడెంట్స్ కాకుండా గొప్ప ప్లానే వేశాడు!

Updated Date - Feb 12 , 2024 | 06:55 PM