Share News

Viralvideo: ఈ డాల్ఫిన్‌కు ఎంత తెలివి! సముద్రంలో కుక్క మునిగిపోతోందని గుర్తించిన వెంటనే..

ABN , Publish Date - Feb 12 , 2024 | 06:16 PM

సముద్రంలో మునిగిపోతున్న కుక్కను ఓ డాల్ఫిన్ కాపాడిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Viralvideo: ఈ డాల్ఫిన్‌కు ఎంత తెలివి! సముద్రంలో కుక్క మునిగిపోతోందని గుర్తించిన వెంటనే..

ఇంటర్నెట్ డెస్క్: తెలివితేటల్లో మానవుడికి దరిదాపుల్లోకి వచ్చే జంతువులు చాలా తక్కువ. అలాంటి వాటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది డాల్ఫిన్ల గురించే. కొత్త విషయాలను సులువుగా నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడంలో ఇవి దిట్టలు. డాల్ఫిన్ల తెలివితేటలన్ని కళ్లకుకట్టినట్టు చూపించే ఘటనలు గతంలో అనేకం వెలుగు చూశాయి. అలాంటి మరో ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (ViralVideo) మారింది. ప్రాణాపాయంలో చిక్కుకున్న కుక్కను ఆ డాల్ఫిన్ కాపాడిన తీరు వీడియోలో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Viral: ‘ప్లీజ్.. పిల్లల్ని కనండి! ఒక్కో బిడ్డకు రూ.62 లక్షలు చొప్పున ఇస్తాం..’


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ కుక్క ఏదో కారణంతో పడవ నుంచి సముద్రంలోకి పడిపోతుంది. అలలతాకిడికి ఈద లేక నానా అగచాట్లు పడుతుంది. చివరకు మునిగిపోయేస్థితికి వచ్చింది. ఇది చూసిన ఓ డాల్ఫిన్ వెంటనే రంగంలోకి దిగింది. ఆ కుక్క వద్దకు వెళ్లి దాన్ని తన వీపు మీద ఎక్కించుకుని జాగ్రత్తగా పడవ వద్దకు తీసుకొచ్చింది. డాల్ఫిన్ తనను రక్షించడానికే వచ్చిందని అర్థం చేసుకున్న కుక్క కూడా ఏమాత్రం కంగారు పడకుండా దాని వీపు మీదకు ఎక్కింది. పడవను సమీపించగానే చటుక్కున అందులోకి దూకేసింది. చివరగా కుక్క వెనక్కు తిరిగి ఆ డాల్ఫిన్‌కు తనదైన శైలిలో థాంక్స్ కూడా చెప్పింది. డాల్ఫిన్‌‌ కూడా కుక్క భావం అర్థమైనట్టే ప్రవర్తించింది (Dolphin saves dog from drowning in the sea).

Viral: అసలీ ఆర్టీసీ బస్సుల్లో ఏం జరుగుతోంది? ఈ మహిళలను చూడండి.. ఎవరు చెప్పినా ఆగకుండా..


వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డాల్ఫిన్ తెలివిని వేనోళ్లపోగుడుతున్నారు. తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందని ఓ యూజర్ చెప్పాడు. తనను ఓ డాల్ఫిన్ షార్క్ నుంచి కాపాడిందని పేర్కొన్నాడు. డాల్ఫిన్‌లకు తెలివితేటలు అపారమని కొందరు కామెంట్ చేశారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం ఈ సీన్ తాము చూసిన ఏదో మూవీలోనిదని అనుమానం వ్యక్తం చేశారు. ఘటన ఎక్కడ జరిగినా జనాలకు మాత్రం ఈ వీడియో తెగ నచ్చేయడంతో కొన్ని రోజులుగా ఇది ట్రెండింగ్‌లో ఉంది.

Viral: ఈ డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా! యాక్సిడెంట్స్ కాకుండా గొప్ప ప్లానే వేశాడు!

Updated Date - Feb 12 , 2024 | 06:23 PM