Share News

Viral: అసలీ ఆర్టీసీ బస్సుల్లో ఏం జరుగుతోంది? ఈ మహిళలను చూడండి.. ఎవరు చెప్పినా ఆగకుండా..

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:17 PM

బెంగళూరులోని ఓ ఆర్టీసీ బస్సులు ఇద్దరు మహిళ ప్రయాణికులు రెచ్చిపోయి పరస్పరం దాడి చేసుకున్న తీరు నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: అసలీ ఆర్టీసీ బస్సుల్లో ఏం జరుగుతోంది? ఈ మహిళలను చూడండి.. ఎవరు చెప్పినా ఆగకుండా..

ఇంటర్నెట్ డెస్క్: ప్రజారవాణా సాధనాలు.. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే బస్సులు, రైళ్లల్లో ప్రయాణికుల గొడవలు మామూలే. కానీ, సోషల్ మీడియా వచ్చాక ఈ ఘర్షణల వీడియోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. పురుషులూ, మహిళలు అనే తేడాల్లేకుండా చిన్న విషయలకే పరస్పరం చేయి చేసుకునేదాకా వెళ్లిపోతున్నారు. తాజాగా బెంగళూరు ఆర్టీసీ బస్సులో వెలుగుచూసిన ఓ షాకింగ్ సన్నివేశం జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. అసలీ ఆర్టీసీ బస్సుల్లో ఏం జరుగుతోందంటూ అనేక మంది ఈ వీడియోను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు (Women hit each other with shoes on Bengaluru ).


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇద్దరు మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఒకరినొకరు ఇష్టారీతిన చెప్పులతో దాడి చేసుకున్నారు. ముందు సీటులో ఉన్న మహిళ వెనుక ఉన్న మహిళపై మొదట దాది చేసింది. దీంతో, వెనక సీటులోని మహిళ తన షూస్ తీసుకుని ప్రతిదాడికి దిగింది. బస్సులో ఉన్న వారు వారిస్తున్నా ఆ ఇద్దరూ శాంతించలేదు. ఇతర ప్రయాణికులు తమను సెల్‌ఫోన్ కెమెరాతో రికార్డు చేస్తున్నా పట్టించుకోలేదు. పరస్పరం చెడామడా కొట్టేసుకున్నారు.


ఇతర ప్రయాణికులు చెప్పిన దాని ప్రకారం, తగవుపడుతున్న మహిళల్లో ఒకరు కిటికీ బార్లగా తీశారట. దీంతో, మొదలైన వివాదం ఒక్కసారిగా ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏం జరుగుతోంది..ఎందుకింత గొడవలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. జీవితంలో ఎన్నో బాధతలు మౌనంగా భరించే మధ్యతరగతి జీవులు తీవ్ర ఒత్తిడిలో ఇలా సహనం కోల్పోతున్నారంటూ కొందరు కామెంట్ చేశారు.

Updated Date - Feb 09 , 2024 | 03:35 PM