Share News

Cholesterol: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు..!

ABN , Publish Date - Jul 10 , 2024 | 08:12 AM

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. శరీరానికి కొవ్వులు అవసరమే.. అయితే కొవ్వులలో రెండు రకాలు ఉన్నాయి. అవి ఆరోగ్య కరమైన కొవ్వులు, అనారోగ్యకరమైన కొవ్వులు. వీటిలో చెడు కొవ్వులే కాదు.. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఉండటం అనారోగ్యమే.

Cholesterol: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు..!

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. శరీరానికి కొవ్వులు అవసరమే.. అయితే కొవ్వులలో రెండు రకాలు ఉన్నాయి. అవి ఆరోగ్య కరమైన కొవ్వులు, అనారోగ్యకరమైన కొవ్వులు. వీటిలో చెడు కొవ్వులే కాదు.. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఉండటం అనారోగ్యమే. ఈ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకుంటే కాలేయం, గుండెకు సంబంధించిన జబ్బులు. ఊబకాయం వంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. ఒకవేళ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని తెలిస్తే ఈ కింది చిట్కాలు ఫాలో అవడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

Optical Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. 5సెకెన్లలో అవకాడోలలో హృదయం ఆకారాన్ని కనిపెట్టండి చూద్దాం..!



ఆహారం..

కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా బాగా సహాయపడుతుంది. ఓట్ మీల్, చిక్కుళ్లు, యాపిల్, బెర్రీస్ వంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు కూడా తినాలి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

వ్యాయామం..

వ్యాయామం శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ కనీసం అరగంట నుండి గంట సేపు వ్యాయామం చేయాలి.

బరువు..

అధిక బరువు ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీసుకునే ఆహారంలో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, అనారోగ్యకరమైన కొవ్వుల మీద దృష్టి పెట్టాలి.

ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!


ధూమపానం, మద్యపానం..

ధూమపానం, మద్యపానం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే వీటిని మానేయాలి.

హెల్త్ చెకప్..

ఏమాత్రం దీర్ఘకాలిక అనారోగ్యాలు అయినా లేక అధిక బరువు, ఊబకాయం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నా రెగ్యులర్ గా డాక్టర్ ను కలిసి హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

5ఏళ్ల లోపు పిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి..!

ఈ శాకాహార ఆహారాలు తింటే చాలు.. ఆయుష్షు ఫుల్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 10 , 2024 | 08:12 AM