5ఏళ్ల లోపు పిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి..!

పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పిస్తే వారు జీవితాంతం వాటిని వదిలిపెట్టరు.

చిన్నతనం నుండే గౌరవభావాన్ని నేర్పించాలి.  ఎంత కోపంలో ఉన్నా ఇతరులను అవమానించి మాట్లాడకూడదని చెప్పాలి.

పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా, దాచిపెట్టకుండా  వాటిని ఒప్పుకునేలా అలవాటు చెయ్యాలి.

దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను వ్యక్తం చేసే విధానంను పిల్లలకు 5 ఏళ్ల లోపే నేర్పాలి.  ఇది పిల్లలను దృఢంగా ఉంచుతుంది.

పరిస్థితులకు అనుగుణంగా సారీ, థ్యాంక్స్ వంటివి చెప్పడాన్ని,  ఎవరినైనా క్షమించే తత్వాన్ని పిల్లలకు నేర్పించాలి.

ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం వాళ్లే ఆలోచించేలా పిల్లలకు అలవాటు చెయ్యాలి.  ఇది వారి భవిష్యత్తును అందంగా మారుస్తుంది.