Black Pepper: మిరియాలను పెద్దగా ఉపయోగించం కానీ.. వీటిని రోజూ ఆహారంలో ఉండేలా చూసుకుంటే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:45 PM
వంటింట్లో మిరియాల వాడకం తక్కువనే చెప్పవచ్చు. కానీ వీటిని రోజూ వంటల్లో వాడితే కలిగే షాంకిగ్ ఫలితాలివీ..
వంటింటి పోపుల పెట్టెలో మిరియాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే వీటిని ఉపయోగించడం మాత్రం కాస్త తక్కువే. ఏదైనా మసాలాలు చేయడానికో లేక ఎప్పుడైనా గొంతు సమస్యలు చుట్టుముట్టినప్పుడు మిరియాల పాలు, మిరియాల టీ లాంటివి చేయడానికో, పండ్ల ముక్కలు, ఇతర ఆహారాల మీద మిరియాల పొడిని చల్లుకోవడానికో ప్రాధాన్యత ఇస్తారు. కానీ మిరియాలను రోజూ ఆహారంలో ఉండేలా చూసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాసింత మిరియాలపొడి, అల్లం పొడి మజ్జిగలో కలిపి తాగుతున్నా, మిరియాలను వంటల్లో ఉపయోగిస్తున్నా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటో ఓ లుక్కేస్తే..
జీర్ణశక్తికి మంచిది..
నల్లమిరియాలలో ఉండే పైపెరిన్ అనే సమ్మేళనం జీర్ణ ఎంజైమ్ ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా జీవక్రియ మెరుగ్గా ఉండటంలో సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మిరియాలలో ఉండే యాంటీఇన్ప్లమేటరీ లక్షణాలు జీర్ణసంబంధ సమస్యలు అన్నీ తగ్గించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: Viral Video: ఇదీ ఫ్యామిలీ వర్క్ కు దక్కే ఫలితం.. ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఏనుగులన్నీ ఏం చేశాయో మీరే చూడండి..!
యాంటీ ఆక్సిడెంట్లు..
మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడి శరీర కణాలకు నష్టం వాటిల్లకుండా చేస్తాయి. మిరియాలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండే క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి..
బరువు తగ్గడానికి కూడా మిరియాలు భలే సహాయపడతాయి. మిరియాలలో ఉండే పైపెరిన్ శరీరంలో అదనపు కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వును శక్తిగా మార్చి కొవ్వు తగ్గిస్తుంది. కొత్తగా కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు ఆహారంలో మిరియాలను వాడుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మెదడు పనితీరు..
మిరియాలలో ఉండే పైపెరిన్ సెరోటోనిన్, డోపమైన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని, అభిజ్ఞా పనితీరును మెరుగుపరిచే న్యూరోట్రాన్స్మీటర్లు. ఈ విధంగా మెదడు చురుగ్గా ఉంచి జ్ఞాపకశక్తిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అల్జీమర్స్, న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
నొప్పి, మంట సమస్యలకు మంచిది..
దీర్ఘకాలిక మంట ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి ఇన్ఫ్లమేషన్ కారణంగా ఎదురవుతాయి. మిరియాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో వాపులు ఏర్పడకుండా ఉండటానికి మిరియాలలో ఉండే పైపెరిన్ సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: బాబోయ్.. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు ఇవా..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.