Share News

Sperm Health: మగవారు.. సంతానోత్పత్తి సమస్యలా.. వీర్య వృద్ధికి తినాల్సినవి, తినకూడనివివే

ABN , Publish Date - Apr 06 , 2024 | 08:15 PM

పెళ్లయ్యి ఏళ్లు గడిచినా.. సంతానానికి నోచుకోని దంపతులు ఎందరో ఉన్నారు. పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య రావడానికి ప్రధాన కారణం.. వీర్యం నాణ్యత(Sperm Count) లోపించడం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే శాశ్వతంగా సంతానోత్పత్తికి దూరం కావాల్సి వస్తుంది. వీర్య నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం.

Sperm Health: మగవారు.. సంతానోత్పత్తి సమస్యలా.. వీర్య వృద్ధికి తినాల్సినవి, తినకూడనివివే

ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న జీవన శైలి మగవారి సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఉరుకులు పరుగుల జీవితం, టెన్షన్లు, ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఇవన్నీ.. జీవన శైలి కిందకే వస్తాయి. పెళ్లయ్యి ఏళ్లు గడిచినా.. సంతానానికి నోచుకోని దంపతులు ఎందరో ఉన్నారు.

పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య రావడానికి ప్రధాన కారణం.. వీర్యం నాణ్యత(Sperm Count) లోపించడం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే శాశ్వతంగా సంతానోత్పత్తికి దూరం కావాల్సి వస్తుంది. వీర్య నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం.

కూరగాయలు, పండ్లు..

కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, , ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన పండ్లు, కూరగాయలు (క్రాన్‌బెర్రీస్, కొల్లార్డ్ గ్రీన్స్ వంటివి) సెల్యులార్ డ్యామేజ్ నుండి స్పెర్మ్‌ను రక్షిస్తాయి. ఫలదీకరణ సమయంలో వాటి బలం, చలనశీలతను కాపాడతుంది. ఆకుపచ్చ కూరగాయలు, బీన్స్‌లో ఫోలేట్ ఉంటుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అవకాడోలు, మామిడి పండ్లు, బచ్చలికూర, బ్రకౌలిలో విటమిన్ ఇ ఉంటుంది. విటమిన్ సి అధిక స్థాయిలో నారింజ, ఆస్పరాగస్, దానిమ్మ, టమోటాలు, ద్రాక్షపండ్లలో ఉంటుంది. వీర్య వృద్ధికి విటమిన్ ఇ, సి లు ఉన్న పదార్థాలు తినడం మంచిది. విటమిన్లతోపాటు ఫోలేట్‌లను ఆహారంలో భాగంగా చేసుకోవడానికి చిలగడదుంపలు తీసుకోవాలి.

చేపలు..

సాల్మన్, హెర్రింగ్, సార్డినెస్, ఆంకోవీస్ చేపలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇది వీర్య కణాల వృద్ధికి దోహదం చేస్తుంది. సాల్మన్, సార్డినెస్‌లో విటమిన్ బి12, అర్జినైన్, అస్పార్టిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్, చలనశీలతను మెరుగుపరుస్తాయని అధ్యయనాల్లో తేలింది.


నట్స్..

చాలా రకాల గింజల్లో ఒమేగా 3, బి6, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు, జింక్ సమృద్ధిగా ఉంటాయి. గింజలు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వాల్‌నట్‌లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫోలేట్, విటమిన్ B6 సైతం ఉంటుంది. గుమ్మడికాయ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి. అవిసె గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు అన్నీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, ఇతర యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి.

Sorghum: జొన్నల వల్ల ఇన్ని లాభాలా.. తెలిస్తే వదిలిపెట్టరు

మాంసం..

మటన్ తరహా మాంసాల్లో జింక్, విటమిన్ బి 12, సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్, చలనశీలతను మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లి..

స్పెర్మ్ కౌంట్ పెంచడానికి వెల్లుల్లి బెస్ట్ ఫుడ్. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, విటమిన్లు ఎక్కువ. వెల్లుల్లి పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు, స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతుంది.


వీర్య కణాలపై ప్రతికూల ప్రభావం చూపే ఆహారాలు..

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం వల్ల స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. ప్రాసెస్ చేస్తే ఆహారానికి రుచి వస్తుంది కానీ.. అది తింటే వీర్య నాణ్యత తగ్గుతుంది.

సోయా ప్రొటీన్

సోయా చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు. కానీ సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న పురుషులు వీటిని తీసుకోకపోవడం మంచిది. సోయాను తీసుకునే పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని నిరూపితమైంది.

బిస్ ఫినాల్ ఎ (BPA), పురుగుమందులు

మనం తినే ఆహార జాబితాలో ఇవి లేనప్పటికీ.. ఆహారంలో కలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పురుగు మందులు కొట్టని పంట మార్కెట్లో లభ్యం కావట్లేదు. ఆ ఆహారం తిన్న పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నాయి.

మరిన్ని ఆరోగ్యకర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2024 | 08:16 PM