Share News

Basmati Rice: సాధారణ బియ్యం కంటే బాస్మతి రైస్ ఆరోగ్యానికి మంచిదా? దీని గురించి ఆహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

ABN , Publish Date - Apr 01 , 2024 | 11:29 AM

ప్రత్యేక వంటకాల కోసం.. ముఖ్యంగా బిర్యానీ కోసం చాలామంది బాస్మతి బియ్యం వాడుతారు. బాస్మతి బియ్యం ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేదెంటంటే..

Basmati Rice: సాధారణ బియ్యం కంటే బాస్మతి రైస్ ఆరోగ్యానికి మంచిదా? దీని గురించి ఆహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

భారతదేశంలో బోలెడు రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. వీటిలో రకాన్ని బట్టి ధరలు కూడా ఉంటాయి. ప్రత్యేక వంటకాల కోసం.. ముఖ్యంగా బిర్యానీ కోసం చాలామంది వాడే బియ్యం బాస్మతీ. బాస్మతి బియ్యం పొడవుగా, ప్రత్యేకమైన సువాసనతో ఉంటుంది. భారతదేశంలో వివిధ రకాల బాస్మతి బియ్యం అందుబాటులో ఉన్నాయి. సాధారణ బియ్యం కంటే బాస్మతి బియ్యం ఆరోగ్యపరంగా మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. అసలు బాస్మతి రైస్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..

తక్కువ గ్లైసెమిక్ సూచిక..

బాస్మతి బియ్యం ఇతర రకాల బియ్యంతో పోలిస్తే తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది . ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా కాకుండా నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో ఎప్పటికప్పుడు చక్కెర స్థాయిలను చెక్ చేసుకునేవారికి లేదా మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది.

ఇది కూడా చదవండి: వేసవికాలంలో పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!


పోషకాలు..

ఈ బియ్యంలో డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, థయామిన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

సువాసన..

బాస్మతి రైస్ ప్రత్యేకమైన సువాసన, ప్రత్యేక రుచితో ఉంటుంది. ఇది తినేటప్పుడు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది.

ఆర్సెనిక్ కంటెంట్..

బాస్మతి బియ్యంలో తక్కువ ఆర్సెనిక్ కంటెంట్‌ను ఉంటుంది. మధుమేహం ప్రమాదాన్ని పెంచే, మొత్తం ఆరోగ్యానికి హాని కలిగించే లోహమిది.

సోడియం కంటెంట్..

ఇతర బియ్యంలా కాకుండా బాస్మతి బియ్యంలో తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులకు మంచిది.

కొవ్వు పదార్థం..

బాస్మతి బియ్యం తక్కువ కొవ్వు పదార్ధాలను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 11:29 AM