Share News

Loksabha Polls: ఊపందుకున్న ప్రచారం.. భారీగా పట్టుబడుతోన్న నగదు.. ఎంతంటే..?

ABN , Publish Date - Apr 15 , 2024 | 04:31 PM

లోక్ సభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం పతాకస్థాయికి చేరింది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటుకు ఎంతయినా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. ఎన్నికల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు.

Loksabha Polls: ఊపందుకున్న ప్రచారం.. భారీగా పట్టుబడుతోన్న నగదు.. ఎంతంటే..?
Election Commission Seizes Rs 4,650 Crore Ahead Of Lok Sabha Polls Highest-Ever

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో (Loksabha Polls) ప్రలోభాల పర్వం పతాకస్థాయికి చేరింది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటుకు ఎంతయినా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. ఎన్నికల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు రూ.4 వేల 650 కోట్ల నగదును సీజ్ చేశామని ప్రకటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సీజ్ చేసిన నగదు కన్నా ఇది ఎక్కువ. లోక్ సభ ఎన్నికల పోలింగ్ప ప్రారంభం కాకముందే భారీగా నోట్ల కట్టలు బయట పడుతున్నాయి.

Kamal Nath: మాజీ సీఎం కమల్‌నాథ్ నివాసంపై పోలీస్ రెయిడ్స్


రోజు రూ.100 కోట్లు

ఏప్రిల్ 19వ తేదీన లోక్ సభ తొలి విడత పోలింగ్ జరగనుంది. మరో మూడు రోజుల్లో మరింత నగదు చేతులు మారుతుందని అంచనా వేశారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మార్చి 1వ తేదీ నుంచి రోజు రూ.100 కోట్ల నగదు పట్టుబడుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ టీమ్, వీడియో టీమ్స్, బోర్డర్ చెక్ పోస్ట్ టీమ్‌లు కలిసి 24 గంటలు పని చేస్తున్నాయి. నగదు పంపిణీ, మద్యం సరఫారా, డ్రగ్స్, ఉచితాలు అందకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని వివరించారు.

Bhagwant Mann: కేజ్రీవాల్‌‌కు జైలులో ట్రీట్‌మెంట్ దారుణం.. పంజాబ్ సీఎం భావోద్వేగం


7 విడతల్లో పోలింగ్

లోక్ సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరగుతాయి. ఏప్రిల్ 19వ తేదీన మొదటి విడత జరుగుతుంది. 26వ తేదీన రెండో విడత, మే 7వ తేదీన మూడో విడత, మే 13వ తేదీన నాలుగో విడత, మే 20వ తేదీన ఐదో విడత, మే 25వ తేదీన ఆరో విడత, జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆ రోజు మధ్యాహ్నం వరకు ట్రెండ్ తెలిసిపోతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 15 , 2024 | 04:31 PM