Share News

Lok Sabha Polls2024: లోక్‌సభ తుది దశ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం..

ABN , Publish Date - May 30 , 2024 | 06:30 PM

లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Election 2024) చివరిదైనా ఏడవ దశ పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. 8 రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న (శనివారం) పోలింగ్ జరగనుంది.

Lok Sabha Polls2024: లోక్‌సభ తుది దశ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం..
7th phase poll

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Election 2024) చివరిదైనా ఏడవ దశ పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. 8 రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న (శనివారం) పోలింగ్ జరగనుంది. 57 లోక్ సభ స్థానాలకుగానూ మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎంపీ స్థానాల విషయానికి వస్తే బీహార్ -8, చండీఘడ్ -1, హిమాచల్ ప్రదేశ్ -4, జార్ఖండ్ -3, ఒడిశా -6, పంజాబ్ -13, ఉత్తరప్రదేశ్ -13, పశ్చిమ బెంగాల్‌-9 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


7వ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ అభ్యర్థుల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ, పాట్నా సాహెబ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్, గోరఖ్‌పూర్ నుంచి భోజ్ పూర్ నటుడు రవి కిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, హిమాచల్ ప్రదేశ్ అమీర్పూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, పాటలీపుత్ర లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, బటిండా నుంచి హర్ సీమ్రత్ కౌర్ బాధల్, జలంధర్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎన్నికల బరిలో నిలబడ్డారు.


అభ్యర్థుల సంఖ్య విషయానికి వస్తే బీహార్‌లో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చండీగఢ్‌లో 1 స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 4 లోక్‌సభ స్థానాలకు 37 మంది, జార్ఖండ్‌లో 3 లోక్‌సభ స్థానాల్లో 52 మంది, ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలకు 66 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఇక పంజాబ్‌లో 13 ఎంపీ స్థానాలకు 328 మంది, ఉత్తర ప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో 144 మంది బరిలో నిలిచారు. వెస్ట్ బెంగాల్ 9 స్థానాలకుగానూ 124 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణ కీలక పిటిషన్

నాకు పోస్టింగ్ ఇవ్వండి.. ఏపీ సీఎస్‌ను కోరిన ఏబీ వెంకటేశ్వరరావు

For more Election News and Telugu News

Updated Date - May 30 , 2024 | 06:35 PM