JEE Advanced Results: JEE అడ్వాన్స్‌డ్ 2024 రిజల్ట్స్ విడుదల.. వీరే టాప్ 10 ర్యాంకర్లు
ABN , Publish Date - Jun 09 , 2024 | 11:42 AM
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2024(jee advanced 2024) ఫలితాలు విడుదలయ్యాయి (results out). ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ (jeeadv.ac.in)ని సందర్శించి వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆదివారం ఉదయం ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ నేపథ్యంలో టాప్ 10 ర్యాంకర్ల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ 2024(jee advanced 2024) ఫలితాలు విడుదలయ్యాయి (results out). ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ (jeeadv.ac.in)ని సందర్శించి వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆదివారం ఉదయం ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ ఫలితాలలో IIT ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360కి 355 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఐఐటీలలో ప్రవేశానికి మొత్తం 48,248 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, వారిలో 7,964 మంది మహిళలు ఉన్నారు.
JEE అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ముందుగా JEE అడ్వాన్స్‌డ్ 2024 jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
ఫలితం కోసం లింక్‌పై క్లిక్ చేయండి
మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి
ఆ తర్వాత JEE అడ్వాన్స్‌డ్ 2024 స్కోర్‌కార్డ్ ప్రదర్శించబడుతుంది
ఆ ఫలితాన్ని చెక్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసి, దాన్ని ప్రింటవుట్ తీసుకోండి
JEE అడ్వాన్స్‌డ్ 2024 టాప్ 10 ర్యాంకర్లు (jee advanced 2024 top 10 rankers)
వేద్ లహోటీ - 355 మార్కులు -IIT ఢిల్లీ
ఆదిత్య - 346- IIT ఢిల్లీ
భోగలపల్లి సందేశ్ - 338 - IIT మద్రాస్
రిథమ్ కేడియా - 337 IIT రూర్కీ
పుట్టి కుశాల్ కుమార్ - 334 - IIT మద్రాస్
రాజ్‌దీప్ మిశ్రా - 333 - IIT బాంబే
ద్విజా ధర్మేష్‌కుమార్ పటేల్ - 332- IIT బాంబే
కోడూరు తేజేశ్వర్ - 331-IIT మద్రాస్
ధృవిన్ హేమంత్ దోషి -329-IIT బాంబే
అల్లడబోయిన SSDB సిద్ధవిక్ సుహాస్ -329 -IIT మద్రాస్
ఇక జేఈఈ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ 2024కి అర్హులు. రేపు జూన్ 10న josaa.nic.inలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు పొందిన మార్కులు, సాధారణ ర్యాంక్ జాబితా (CRL), కేటగిరీ ర్యాంక్ జాబితాను కలిగి ఉంటాయి. ఈ ప్రవేశ పరీక్ష మే 26, 2024న దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
ఇవి కూడా చదవండి..
TG News: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభం..
Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.