Share News

Accident: ఆలయానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మృతి

ABN , Publish Date - May 05 , 2024 | 01:38 PM

రాజస్థాన్‌(Rajasthan) సవాయ్ మాధోపూర్‌(Sawai Madhopur)లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం ఆకస్మాత్తుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందగా, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.

Accident: ఆలయానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మృతి
Six people were killed when an unknown vehicle collided

రాజస్థాన్‌(Rajasthan) సవాయ్ మాధోపూర్‌(Sawai Madhopur)లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం ఆకస్మాత్తుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందగా, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ క్రమంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జైపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే కారులోని ప్రయాణికులు రణతంబోర్ త్రినేత్ర గణేష్ ఆలయానికి దర్శనం కోసం వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది


ఈ ఘటన సవాయ్ మాధోపూర్‌(Madhopur)లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో కారు దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం చాలా ఘోరంగా ఉందని, మృతదేహాలను బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా తెలియరాలేదని అన్నారు. గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


దీంతోపాటు మృతుల బంధువులకు(family) సమాచారం అందించినట్లు చెప్పారు. మృతులను సంతోష్ భార్య గజానంద్ శర్మ, అనిత భార్య మనీష్ శర్మ, పూనమ్ భార్య సతీష్ శర్మ, కైలాష్ కుమారుడు రామావతార్ శర్మ, మనీష్ కుమారుడు రామావతార్ శర్మ, సికార్ నివాసి సతీష్ శర్మగా పోలీసులు(police) గుర్తించారు. అయితే అసలు ఇంత ఘోరంగా ప్రమాదం జరగడానికి గల కారణాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా లేదా ఏదైనా ట్రక్కు లాంటిది ఆకస్మాత్తుగా వచ్చి ఢీకొట్టిందా అనే విషయాలను తెలుసుకుంటున్నారు.


ఇది కూడా చదవండి:

Gold Seized: ఎయిర్‌పోర్ట్‌లో 12 కేజీల గోల్డ్ స్వాధీనం


Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు



Read Latest Crime News and Telugu News

Updated Date - May 05 , 2024 | 01:47 PM