Secunderabad: రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత..
ABN , Publish Date - Dec 18 , 2024 | 08:46 AM
ఒడిశా నుంచి సికింద్రాబాద్(Odisha to Secunderabad) మీదుగా రైలులో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- నిందితుడి అరెస్టు
సికింద్రాబాద్: ఒడిశా నుంచి సికింద్రాబాద్(Odisha to Secunderabad) మీదుగా రైలులో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావిద్, ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫ్లాట్‌పాం నంబర్ 8కు చేరుకున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేయగా జనరల్‌బోగీలో అనుమానాస్పద స్థితిలో కనిపించిన రోహన్‌రాజు(20)ను పట్టుకుని విచారించారు. బెర్తు కింద దాచిన బ్యాగును పరిశీలించగా, అందులో 13 కిలోల పొడి గంజాయిని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూలో ‘హై-ఫై’ ఫెసిలిటీ..
రూ. 60వేలు విలువ చేసే మద్యం స్వాధీనం
హైదరాబాద్ సిటీ: ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి అక్రమంగా దిగుమతి అవుతున్న మద్యాన్ని ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు మంగళవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అతని వద్ద రూ. 60 వేల విలువైన 35 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి(Rajasekhar Reddy) ఢిల్లీ నుంచి ఎన్‌డీపీఎల్ (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) మద్యాన్ని అక్రమంగా నగరానికి దిగుమతి చేసుకుంటున్నట్లు ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ (స్టేట్ టాస్క్ ఫోర్స్) బృందానికి సమాచారం అందింది.
కేఎస్ఆర్ రైల్లో మద్యాన్ని తెస్తున్నట్లు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలోని బృందం నిఘా పెట్టింది. సికింద్రాబాద్ సమీపంలో నిందితున్ని పట్టుకున్నారు. అతని వద్ద 24 రెడ్‌లేబుల్, 11 డిఫెన్స్ మొత్తం 35 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణతో పోల్చితే డిల్లీలో సగం ధరలకే మద్యం బాటిళ్లు దొరుకుతుండటంతో అక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో సరుకు తెచ్చి నగరంలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అక్రమంగా నగరానికి తెస్తున్న నిందితున్ని పట్టుకున్న ఎస్‌టీఎఫ్ టీమ్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News