Share News

Hyderabad: అయ్యోదేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - May 21 , 2024 | 10:28 AM

స్విచ్‌బోర్డు చెక్‌ చేస్తుండగా కరెంట్‌ షాక్‌ తో మీటర్‌ రీడింగ్‌ బాయ్‌ మృతి చెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌(Gachibowli Police Station) పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది.

Hyderabad: అయ్యోదేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

- కరెంట్‌ షాక్‌తో మీటర్‌ రీడింగ్‌బాయ్‌ మృతి

రాయదుర్గం(హైదరాబాద్): స్విచ్‌బోర్డు చెక్‌ చేస్తుండగా కరెంట్‌ షాక్‌ తో మీటర్‌ రీడింగ్‌ బాయ్‌ మృతి చెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌(Gachibowli Police Station) పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన టి.ఆనంద్‌బాబు (32) ఐదేళ్ల క్రితం కొండాపూర్‌ సబ్‌స్టేషన్‌లో మీటర్‌రీడింగ్‌ బాయ్‌గా చేరాడు. అతని కుటుంబం గుంటూరు(Guntur)లోనే ఉండటంతో అతను సబ్‌స్టేషన్‌లోనే నివసిస్తున్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు...


కాగా.. సోమవారం సాయంత్రం కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలోని అర్జున్‌ హోమ్స్‌ అపార్టుమెంట్‌లో విద్యుత్‌ సరఫరా సమస్య రావడంతో సబ్‌స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చింది. దాంతో విద్యుత్‌ సిబ్బంది నాన్‌టెక్నీషియన్‌ అయిన ఆనంద్‌బాబును అక్కడికి పంపారు. అతను వెళ్లి స్విచ్‌బోర్డు చెక్‌ చేస్తుండగా ఎడమ చేతికి కరెంట్‌షాక్‌ తగిలి మృతి చెందాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 21 , 2024 | 10:28 AM