Hyderabad: ప్రేమ పేరుతో వేధింపులు.. యాసిడ్ తాగి యువతి మృతి
ABN , Publish Date - Dec 26 , 2024 | 09:40 AM
కూతురు బాగా చదివి ఉద్యోగం చేసి కుటుంబ కష్టాలను గట్టెక్కిస్తుందని భావించిన ఓ పేద కుటుంబానికి తీరని శోకం మిగిలింది. ప్రేమ పేరుతో యువకుడు పెట్టిన వేధింపులకు మనస్తాపం చెందిన చదువుల తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
- పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
- ప్రేమ వ్యవహారమే మా బిడ్డను పొట్టన పెట్టుకుందని ఫిర్యాదు
హైదరాబాద్: కూతురు బాగా చదివి ఉద్యోగం చేసి కుటుంబ కష్టాలను గట్టెక్కిస్తుందని భావించిన ఓ పేద కుటుంబానికి తీరని శోకం మిగిలింది. ప్రేమ పేరుతో యువకుడు పెట్టిన వేధింపులకు మనస్తాపం చెందిన చదువుల తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో బుధవారం జరిగింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: డీజేల గోల.. నిద్రపోయేదెలా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడ(Dammaiguda) పరిధిలోని న్యూభవానీనగర్‌లో పొనగంటి తానేష్, భార్య పద్మ, కుమార్తె పూర్ణిమ, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ పూర్ణిమ(19)ను ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదివిస్తున్నారు. ఈనెల 24న కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన పూర్ణిమ ట్యూషన్‌లో పిల్లలకు పాఠాలు చెబుతోంది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లి యాసిడ్ తాగి పిల్లలకు చెప్పి పడిపోయింది.

విషయాన్ని పిల్లలు కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. నిఖిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడడం వల్లే చనిపోయిందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. కుషాయిగూడ ఏసీపీ మహేష్ కుమార్ హామీ మేరకు వారు ఆందోళన విరమించారు. కాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదయ్య తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్ లైంగిక వేధింపులు నిజమే
ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్ డీపీ మార్చి.. మెసేజ్ పంపి..
ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా
Read Latest Telangana News and National News