Share News

Hyderabad: డీజేల గోల.. నిద్రపోయేదెలా..

ABN , Publish Date - Dec 26 , 2024 | 08:51 AM

అల్వాల్‌(Alwal) రెసిడెన్షియల్‌ జోన్‌గా ప్రసిద్ది చెందింది. ఇలా ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన కాలనీల సముదాయాలతో పాటు ఇక్కడ ఉన్న ఫంక్షన్‌ హాళ్లతో స్థానికులకు నిద్రాభంగం కలుగుతోంది. ఆయా ఫంక్షన్‌ హాళ్ల సమీపంలో ఉండే నివాసితులకు ఉదయం నుంచి రాత్రి వరకు మైక్‌లు, ఆర్కెస్ర్టాల శబ్దాలతో నిర్వాహకులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.

Hyderabad: డీజేల గోల.. నిద్రపోయేదెలా..

- అల్వాల్‌లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం

హైదరాబాద్: అల్వాల్‌(Alwal) రెసిడెన్షియల్‌ జోన్‌గా ప్రసిద్ది చెందింది. ఇలా ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన కాలనీల సముదాయాలతో పాటు ఇక్కడ ఉన్న ఫంక్షన్‌ హాళ్లతో స్థానికులకు నిద్రాభంగం కలుగుతోంది. ఆయా ఫంక్షన్‌ హాళ్ల సమీపంలో ఉండే నివాసితులకు ఉదయం నుంచి రాత్రి వరకు మైక్‌లు, ఆర్కెస్ర్టాల శబ్దాలతో నిర్వాహకులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. పగలు ఎలాగోలా నెట్టుకొస్తున్నా రాత్రి సమయాల్లోనూ మైక్‌ల హోరుతో కంటికి నిద్ర కరువవుతుంది. రోగాలతో సతమతమయ్యే వృద్ధుల ఇబ్బందులు వర్ణాణాతీతంగా ఉంటున్నాయి. విద్యార్థుల చదువుకు సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటు.. యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు మృతి


పెరుగుతున్న శబ్ద కాలుష్యం

పెళ్లిళ్లు, పుట్టినరోజు, సన్మానాలు, కళాశాలల ఫ్రెషర్స్‌డే వంటి కార్యక్రమాలు ఉన్న సమయాల్లో డీజేలతో హోరెత్తిస్తున్నారు. ఆయా వేడుకలకు రాత్రి 10 వరకు అనుమతి తీసుకొని అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫంక్షన్‌ హాళ్ళ యజమానులపై కేసులు నమోదవుతున్నా వారు స్పందించడం లేదు.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇలా..

రాత్రిళ్ళు కలిగించే శబ్ద కాలుష్యం వల్ల వ్యక్తి శారీరక స్థితి, ప్రశాంతతకు భంగం ఏర్పడి వారి జీవనంపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. నిద్రాభంగానికి కారణమయ్యే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొంది.


నియంత్రించేవారు కరువు

ఫంక్షన్‌హాళ్లతోపాటు రోడ్లపై పెరుగుతున్న వాహన శబ్ద కాలుష్యాన్ని అరికట్టేవారే కరువయ్యారు. దీంతో ఫంక్షన్‌ హాళ్ళ నిర్వాహకులు, వాహనదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. శబ్ద కాలుష్యం నియంత్రణకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి.

city6.2.jpg

ఫిర్యాదులు

- అల్వాల్‌, మచ్చబొల్లారం, వెంకటాపురం డివిజన్లలోని ప్రాంతాల్లోని ప్రార్థన మందిరాల నుంచి పెద్ద పెద్ద శబ్దాలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఓల్డ్‌ అల్వాల్‌ చౌరస్తా నుంచి సెయింట్‌ మైఖేల్‌ రోడ్డులో ఉన్నటువంటి ఓ ఫంక్షన్‌ హాల్‌ వద్ద కూడా పెద్ద ఎత్తున డీజేలు, శబ్దాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

- బటన్‌గూడ, కానాజీగూడ-ఇందిరా నగర్‌, ఓల్డ్‌అల్వాల్‌, వెంకటాపురం తదితర ఫంక్షన్‌, కమ్యూనిటీ హాళ్ల పై ఫిర్యాదులు ఉన్నాయి.


అనారోగ్యం పాలవుతారు

శబ్ద కాలుష్యంతో ప్రజలు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. సామాన్యంగా మనుషులు 60 డెసిబుల్స్‌ మాత్రమే నార్మల్‌ రేంజ్‌ ఉంటుంది. అదే 85 డెసిబుల్‌ సౌండ్‌ను 8 గంటల పాటు వింటే చెవి కర్ణ భేరి పగులుతుంది. ఆనారోగ్యం బారిన పడటమే కాకుండా గుండెపోటు, బీపీ, హార్మోన్స్‌ ఇన్‌బాలెన్స్‌ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

- డాక్టర్‌ యాకేందర్‌రెడ్డి, అల్వాల్‌ పీహెచ్‌సీ


శబ్ద కాలుష్యంతో నిద్రాభంగం

ఇటీవల పెరుగుతున్న శబ్ద కాలుష్యం కారణంగా నిద్రాభంగం కలుగుతోంది. ఇష్టానుసారంగా డీజేలను ఏర్పాటు చేసి శబ్దాలను చేస్తున్నారు. రాత్రివేళల్లో నిర్వహించే ఫంక్షన్ల నుంచి వెలువడుతున్న శబ్దాల కారణంగా నిద్రాభంగం కలుగుతోంది. ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారికి నిద్రలేకపోవడంతో మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు.

- నిమ్మ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్‌


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 08:51 AM