Hyderabad: మద్యం బాటిల్ విషయంలో గొడవ.. ఒకరి హత్య
ABN , Publish Date - Dec 31 , 2024 | 09:41 AM
తాగిన మైకంలో తాపీ మేస్త్రీ, ఓ కూలి గొడవ పడి అతనిని హత్య చేశాడు. బుద్వేల్ రజక బస్తీలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మేస్త్రీగా పనిచేసే బుల్లిశెట్టి శ్రీనివాస్(48), కూలిగా పనిచేసే లాలుగాని సాయికుమార్(32) బుద్వేల్‌లో ఉంటున్నారు.

హైదరాబాద్: తాగిన మైకంలో తాపీ మేస్త్రీ, ఓ కూలి గొడవ పడి అతనిని హత్య చేశాడు. బుద్వేల్ రజక బస్తీలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మేస్త్రీగా పనిచేసే బుల్లిశెట్టి శ్రీనివాస్(48), కూలిగా పనిచేసే లాలుగాని సాయికుమార్(32) బుద్వేల్‌లో ఉంటున్నారు. ఆదివారం వచ్చిన కూలీ డబ్బులతో సాయికుమార్ మద్యం బాటిల్ కొని కాస్త తాగి బుద్వేల్‌లోని ఓ దేవాలయం వద్ద నిలుచున్నాడు. అక్కడికి వచ్చిన మేస్త్రీ శ్రీనివాస్ తనకు మద్యం బాటిల్ ఇవ్వాలని కోరడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: శంషాబాద్ నుంచి తుక్కుగూడకు ఏరో రైడర్ సిటీ బస్సులు
మాటామాటా పెరగడంతో మేస్త్రీ రోడ్డుపైన ఉన్న సిమెంటు మ్యాన్‌హోల్ కవర్ తీసుకుని సాయికుమార్ తలపై బాదాడు. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు 108 సాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే సాయికుమార్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్(Rajendranagar Inspector) నిందితుడు బుల్లిశెట్టి శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్య కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్ కదలికలు?
Read Latest Telangana News and National News