Share News

Chennai: మహిళలా మాట్లాడి.. మగవారిని బుట్టలో వేసుకొని..

ABN , Publish Date - May 19 , 2024 | 12:52 PM

సెల్‌ఫోన్‌ యాప్‌ ద్వారా మహిళలా మాట్లాడి మగవారిని బుట్టలో వేసుకొని నగదు దోచుకున్న ఐదుగురిని గ్రేటర్‌ చెన్నై పోలీసులు(Greater Chennai Police) అరెస్ట్‌ చేశారు.

Chennai: మహిళలా మాట్లాడి.. మగవారిని బుట్టలో వేసుకొని..

- సెల్‌ఫోన్‌ యాప్‌ ద్వారా మోసం

- ఐదుగురి అరెస్ట్‌

చెన్నై: సెల్‌ఫోన్‌ యాప్‌ ద్వారా మహిళలా మాట్లాడి మగవారిని బుట్టలో వేసుకొని నగదు దోచుకున్న ఐదుగురిని గ్రేటర్‌ చెన్నై పోలీసులు(Greater Chennai Police) అరెస్ట్‌ చేశారు. స్థానిక వ్యాసర్పాడి మూడవ పల్లం వీధికి చెందిన దామోదరన్‌ (24) జనవరిలో ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా అఖిల అనే మహిళతో మాట్లాడి ఆమెకు రూ.500 పంపించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2న దామోదరన్‌(Damodaran)ను సంప్రదించిన గుర్తుతెలియని వ్యక్తులు తాము సైబర్‌ క్రైం పోలీసులమని, అఖిల అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మీరేనంటూ బెదిరించి రూ.13,500 వసూలుచేసినట్లు తెలిసింది.

ఇదికూడా చదవండి: Cheetah: ఎట్టకేలకు పట్టుబడిన చిరుత


ఈ రకంగా నగరంలో పలువుర్ని మహిళలా మాట్లాడి డబ్బు దోచుకున్న వ్యవహారంపై అందజేసిన ఫిర్యాదు మేరకు పోలీస్‌ కమిషనర్‌ సందీయ్‌రాయ్‌ రాథోడ్‌(Police Commissioner Sandy Roy Rathore) జారీచేసిన ఉత్తర్వులతో సైబర్‌ క్రైం పోలీసులు రంగంలో దిగారు. పట్టాభిరామ్‌కు చెందిన లియోదురై, శ్రీనివాసన్‌, తమిళన్‌, మహ్మద్‌ రియాజ్‌, పృథ్వీరాజ్‌ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు జైలుకు తరలించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 19 , 2024 | 12:52 PM