Share News

Cheetah: ఎట్టకేలకు పట్టుబడిన చిరుత

ABN , Publish Date - May 19 , 2024 | 12:15 PM

తిరునల్వేలి జిల్లా పాపనాశం సమీపంలో సంచరిస్తున్న చిరుత(Cheetah) బోనులో చిక్కింది. కొద్దిరోజులుగా వెంబయాపురం, తిరుపతియాపురం తదితర గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత... మేకలు, కుక్కలపై దాడి చేస్తోంది.

Cheetah: ఎట్టకేలకు పట్టుబడిన చిరుత

చెన్నై: తిరునల్వేలి జిల్లా పాపనాశం సమీపంలో సంచరిస్తున్న చిరుత(Cheetah) ఎట్టకేలకు బోనులో చిక్కింది. కొద్దిరోజులుగా వెంబయాపురం, తిరుపతియాపురం తదితర గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత... మేకలు, కుక్కలపై దాడి చేస్తోంది. దీంతో, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు రాత్రి వేళల్లో నిద్రలేకుండా జాగారం చేస్తున్నారు. ఈ చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు(Forest Department officials) ఐదు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటుచేశారు.


ఇదికూడా చదవండి: Chennai: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు రెడ్‌ అలెర్ట్‌

శుక్రవారం రాత్రి ఆ ప్రాంతానికి వచ్చిన చిరుత, బోనులో కట్టిన మేకను చూసి అందులో ప్రవేశించి చిక్కుకుంది. అధికారులు, వెటర్నరీ వైద్యులు అక్కడకు చేరుకొని చిరుతను పరిశీలించారు. ఐదేళ్ల ప్రాయం కలిగిన ఈ చిరుతను మణిముత్తారు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

nani3.jpg


ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 19 , 2024 | 12:27 PM