Share News

Nafe Singh Rathee: కారుపై 40 రౌండ్ల కాల్పులు..INLD చీఫ్, సెక్యూరిటీ గార్డు మృతి

ABN , Publish Date - Feb 26 , 2024 | 06:44 AM

INLD హర్యానా చీఫ్ నఫే సింగ్ దారుణంగా కాల్చి(firing) చంపబడ్డాడు. అయితే దాడి చేసిన దుండగులు అతని కారుపై 40-50 రౌండ్లు కాల్పులు జరిపడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Nafe Singh Rathee: కారుపై 40 రౌండ్ల కాల్పులు..INLD చీఫ్, సెక్యూరిటీ గార్డు మృతి

ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD) హర్యానా యూనిట్ అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ(Nafe Singh Rathee)ని గుర్తు తెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఝజ్జర్ జిల్లాలోని బహదూర్‌ఘర్ పట్టణంలో రాఠీ కారును లక్ష్యంగా చేసుకుని 40 నుంచి 50 రౌండ్ల కాల్పులు జరిపి దాడి చేశారు. దాడి తర్వాత, తీవ్రంగా గాయపడిన రాఠీని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఈ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే సెక్యూరిటీ గార్డు కూడా చనిపోయాడు. మరో ఇద్దరు పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

దాడి తర్వాత మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీ, ఇతర గాయపడిన వారిని బ్రహ్మశక్తి సంజీవని ఆసుపత్రి(Hospital)లో చేర్చారు. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించినట్లు వైద్యుడు మనీష్ శర్మ తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. గాయపడిన ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్, ఆయన సెక్యూరిటీ గార్డు జై కిషన్ కూడా ఉన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: చైనా వస్తువులతో చిన్న పరిశ్రమలు కుదేలు


నఫే సింగ్ రాఠీ తన ఫార్చూనర్ కారులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇంతలో ఐ-10 కారులో వెళ్తున్న కొందరు దుండగులు వారిని వెంబడించారు. నఫే సింనిగ్ వాహనం బరాహి గేట్ సమీపంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యేపై దుండగులు కాల్పులు జరిపారు. కనీసం 40-50 రౌండ్లు కాల్పులు(firing) జరిపినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో నఫే సింగ్ రాఠీకి పలు మార్లు హత్య బెదిరింపులు వచ్చాయని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ అధికార ప్రతినిధి అమన్‌దీప్‌ తెలిపారు. ఆయనకు ప్రభుత్వం నుంచి భద్రత(Security) కల్పించాలని కోరినప్పటికీ భద్రత కల్పించడం లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీపై గతంలో కూడా చెదురుమదురు దాడులు జరిగినట్లు ఆయన చెప్పారు. నఫే సింగ్ రాఠీ హత్యపై దర్యాప్తు చేసేందుకు ఇద్దరు డీఎస్పీ(DSP)ల నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని ఎస్పీ అర్పిత్ జైన్ తెలిపారు. దీనిపై జిల్లా పోలీసులు విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 07:24 AM