Share News

Bank Rules: బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకుల కొత్త రూల్స్ ఇవే..

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:57 AM

ప్రతి నెలా ఒకటో తేదీన దేశంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పుల ప్రభావం నేరుగా సామాన్యుల జేబులపైనే పడుతోంది. ఈ ఏడాది అప్పుడే జనవరి నెల ముగిసింది.

Bank Rules: బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకుల కొత్త రూల్స్ ఇవే..

ప్రతి నెలా ఒకటో తేదీన దేశంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పుల ప్రభావం నేరుగా సామాన్యుల జేబులపైనే పడుతోంది. ఈ ఏడాది అప్పుడే జనవరి నెల ముగిసింది. ఫిబ్రవరి ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఎన్‌పీఎస్ ఖాతాదారుల ఖాతా నుంచి విత్ డ్రా నిబంధనల్లో ఈ మార్పులు ఉంటాయని తెలిపింది. డిపాజిట్ చేసిన మొత్తంలో 25 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు. ఇందుకు సంబంధించి డిక్లరేషన్‌తో పాటు విత్ డ్రా సమర్పించాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషన్ హోమ్ లోన్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన తగ్గింపు అన్ని గృహ రుణాలకు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. ప్రాసెసింగ్ ఫీజులు, రుణాలపై రాయితీ ఇవ్వనుంది. సామాన్యులకు ఊరటనిచ్చేలా ఆర్‌బీఐ కూడా మార్పులు చేసింది. లబ్ధిదారుని పేరు ఎంటర్ చేయకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ. 5 లక్షల వరకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి సర్క్యులర్‌ ను గతేడాది అక్టోబర్‌ 31న ఎన్‌పీసీఐ జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవల (IMPS) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా మొబైల్ నంబర్, బ్యాంక్ పేరుతో ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకోవచ్చు.

అంతే కాకుండా ఈ ఏడాది టెక్ ఉద్యోగుల లేఆఫ్‌ల పరంపర కొనసాగింది. కేవలం జనవరి నెలలోనే 24,564 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ చేయడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జనవరి 31ని చివరి తేదీగా నిర్ణయించింది. దేశంలో ఇప్పటివరకు దాదాపు 7 కోట్ల ఫాస్టాగ్‌లు మంజూరవగా ప్రస్తుతం 4 కోట్లు మాత్రమే యాక్టీవ్‌గా కనిపిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 12:06 PM